Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నువ్వా నేనా' తేల్చుకుందామంటున్న నితిన్ - విజయ్ దేవరకొండ

వెండితెరపై కుర్ర హీరోలు నితిన్, విజయ్ దేవరకొండలు పోటీపడుతున్నారు. నువ్వానేనా తేల్చుకుందామంటూ సవాళ్లు.. ప్రతిసవాళ్లు విసురుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ కుర్ర హీరోలు నటించిన చిత్రాలు త్వరలో విడుద

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (15:28 IST)
వెండితెరపై కుర్ర హీరోలు నితిన్, విజయ్ దేవరకొండలు పోటీపడుతున్నారు. నువ్వానేనా తేల్చుకుందామంటూ సవాళ్లు.. ప్రతిసవాళ్లు విసురుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ కుర్ర హీరోలు నటించిన చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. ఈ వివరాలను పరిశీలిస్తే, నైజాంలో మెగాస్టార్ అంత‌టివాడిగా నితిన్ వెలిగిపోతున్నాడు. న‌వ‌త‌రంలో మేటి ప్ర‌తిభావంతుడిగా నితిన్‌కి ఉన్న క్రేజు అసాధార‌ణం. ప్ర‌స్తుతం అత‌డు న‌టించిన 'శ్రీ‌నివాస క‌ళ్యాణం' రిలీజ్ బ‌రిలోకి దిగుతోంది. ఆ క్ర‌మంలోనే ఈ ఆదివారం శ్రీ‌నివాస క‌ళ్యాణం టీజ‌ర్ రిలీజైంది. ఈ టీజ‌ర్ రిలీజైన కొన్ని గంట‌ల్లోనే 10 ల‌క్ష‌ల వ్యూస్ ద‌క్కించుకుంది.
 
అయితే ఆస‌క్తిక‌రంగా ఆ మ‌రునాడు (సోమ‌వారం) రిలీజైన విజ‌య్ దేవ‌ర‌కొండ 'గీత గోవిందం' టీజ‌ర్ జెట్‌స్పీడ్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్లింది. ఈ టీజ‌ర్‌ని కేవ‌లం 18 గంట‌ల్లోనే 28 ల‌క్ష‌ల మంది వీక్షించ‌డం విశేషం. నేటి ట్రెండ్‌లో సామాజిక మాధ్య‌మాలే కొల‌మానంగా ఉంది. ఏ హీరోకి ఎంత క్రేజు ఉందో ఇవే డిసైడ్ చేస్తున్నాయి. యూట్యూబ్ వ్యూస్‌ని బ‌ట్టి నైజాంలో నితిన్, దేవ‌ర‌కొండ మ‌ధ్య పోటీ షురూ అయిన‌ట్టే. ఆ ఇద్ద‌రూ నువ్వా నేనా అంటూ కెరీర్ ప‌రంగా దూసుకుపోనున్నారు. 
 
ఇక ఈ ఇద్ద‌రూ న‌టించిన సినిమాలు వారం గ్యాప్‌తో రిలీజ్‌కి వ‌స్తున్నాయి. ఆగ‌స్టు 9న నితిన్ 'శ్రీ‌నివాస క‌ళ్యాణం' రిలీజ‌వుతోంది. స‌రిగ్గా వారం గ్యాప్‌తో ఆగ‌స్టు 15న‌ దేవ‌రకొండ 'గీత గోవిందం' సినిమా రిలీజ్ వార్‌లోకి వ‌స్తోంది. నితిన్ కెరీర్ ప్ర‌స్తుతం ఒడిదుడుకుల్లో ఉంది. కొన్ని ఫ్లాపులు ఇబ్బంది పెట్టాయి. ఇక‌ దేవ‌ర‌కొండ వ‌రుస విజ‌యాల‌తో దూసుకొచ్చాడు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా వార్‌పై అభిమానుల్లో ప్ర‌త్యేకంగా చ‌ర్చ సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments