Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట పర్వం వద్దనుకున్న టబు..

Webdunia
ఆదివారం, 11 ఆగస్టు 2019 (14:43 IST)
బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో టబు నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రానా దగ్గుబాటి హీరోగా వస్తున్న విరాట పర్వంలోనూ టబు కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా రానా విరాట పర్వం నుంచి టబు తప్పుకున్నట్లు సమాచారం. గతంలో బాలకృష్ణతో నటించిన పాండురంగడు తెలుగులో టబు చివరి సినిమా. ఇది రిలీజై దాదాపు పదేళ్లు దాటింది. 
 
దశాబ్దం గ్యాప్‌లో ఆమె కెరీర్ బాలీవుడ్‌లో బలంగానే ఉంది. తాజాగా అంధాదూన్, దేదేప్యార్‌దే మూవీస్‌తో ప్రేక్షకులను అలరించారు. అదే క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి తెలుగులో కూడా రీ ఎంట్రీ ప్లాన్ చేసింది టబు. వేణు ఉడుగుల డైరెక్షన్‌లో విరాటపర్వం అనే పీరియాడిక్ మూవీలో కీరోల్ దక్కించుకుంది. ఇందులో టబుది మహిళా నక్సలైట్ పాత్ర.
 
అయితే రానాకి అనారోగ్యం అంటూ షూటింగ్‌కి బ్రేక్ పడింది. దీంతో ఆమె డేట్స్ వృధా కావడంతో ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేసుకుందని టాక్ వస్తోంది. తాజాగా టబుకి బదులుగా నందితాదాస్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇంకా భారీగా పారితోషికాన్ని కూడా టబు డిమాండ్ చేసిందని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments