Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీముఖి పెళ్ళెప్పుడు..? ఆమె చెప్పిన జవాబు ఏంటి?

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (16:39 IST)
స్టార్ యాంకర్ శ్రీముఖి పెళ్లి గురించి ప్రస్తుతం చర్చ సాగుతోంది. స్టార్ యాంకర్ శ్రీముఖి ఉగాది పండుగ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. ఒక నెటిజన్ శ్రీముఖి పెళ్లి గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ప్రశ్నించారు.
 
ఆ ప్రశ్నకు కూల్‌గా శ్రీముఖి తనకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. పెళ్లి విషయంలో తన తల్లిదండ్రుల నుంచి ఎటువంటి ఒత్తిడి లేదని ఆమె అన్నారు. పెళ్లి చేసుకునే లోపు ఆర్థికంగా సెటిల్ అవ్వాలని అనుకుంటున్నానని శ్రీముఖి తెలిపారు.
 
ప్రస్తుతం శ్రీముఖి పలు టీవీ ఛానెళ్లలో ప్రసారమవుతున్న ఈవెంట్లతో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ తరచూ ఫోటోలను షేర్ చేయడం ద్వారా శ్రీముఖి ఫాలోవర్లను పెంచుకుంటున్నారు. త్వరలో శ్రీముఖి హోస్ట్‌గా కొత్త షోలు కూడా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
 
మరోవైపు శ్రీముఖి చేతిలో సినిమా ఆఫర్లు కూడా ఉన్నాయి. శ్రీముఖి కీలక పాత్రలో నటించిన క్రేజీ అంకుల్స్ త్వరలో రిలీజ్ కానుండగా నితిన్ హీరోగా నటిస్తున్న మ్యాస్ట్రో సినిమాలో కూడా శ్రీముఖి నటిస్తున్నారని సమాచారం. వరుస ఆఫర్లతో శ్రీముఖి కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాట తప్పిన జూనియర్ ఎన్టీఆర్.. బోరున విలపిస్తున్న ఓ తల్లి!!

Mohan Babu: మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ కొట్టివేత

Seethakka: అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డా.. జై భీమ్‌కు అలాంటి గౌరవం లభించలేదు..

గాంధీ భవన్‌కు వెళ్లిన అల్లు అర్జున్ మామ.. పట్టించుకోని దీపా దాస్ మున్షి (video)

Sandhya Theatre stampede: రేవంత్ రెడ్డి కామెంట్లతో ఏకీభవిస్తా, బీజేపీ ఎమ్మెల్యే సంచలనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments