Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మంకీ మ్యాన్"తో నటించడం హ్యాపీ.. హాలీవుడ్ ఎంట్రీపై తెలుగమ్మాయి

సెల్వి
బుధవారం, 20 మార్చి 2024 (16:39 IST)
ఎన్ని సినిమాల్లో నటించినా సినిమా తారలకు హాలీవుడ్‌లో ఛాన్స్‌ వస్తే చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. తాజాగా తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ్ళ హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసింది. తాజాగా హాలీవుడ్ చిత్రం "మంకీ మ్యాన్"లో అవకాశం రావడంతో అలాంటి ఆనందాన్ని పొందింది. 
 
అంతేకాదు "స్లమ్‌ డాగ్‌ మిలియనీర్" ఫేమ్‌ నటుడు దేవ్‌ పటేల్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం ఇటీవల అమెరికాలోని ఆస్టిన్‌లో జరిగిన ప్రతిష్టాత్మక "ఎస్ఎక్స్‌డబ్ల్యూ" (సౌత్ బై సౌత్‌వెస్ట్)లో ప్రదర్శించబడింది.

ప్రీమియర్‌కు హాజరైన శోభితా ధూళిపాళ మాట్లాడుతూ -"వరల్డ్ ప్రీమియర్‌లో మా చిత్రాన్ని చూస్తున్న ప్రేక్షకులు కేకలు వేసి చప్పట్లు కొట్టారు. స్టాండింగ్ ఒవేషన్‌తో ప్రశంసించారు. దర్శకుడిగా దేవ్ పటేల్‌కి ఇది మొదటి సినిమా. హాలీవుడ్‌లో ఇది నా మొదటి సినిమా. 
 
ఈ సినిమాలో నాకు పెద్దగా పాత్ర లేకపోయినా, వేరే భాషలో నటించడం, దేవ్ పటేల్ దృష్టిలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక విపిన్ శర్మ, అశ్విని కల్శేఖర్, మకరంద్ దేశ్ పాండే వంటి భారతీయ తారలతో పాటు పలువురు హాలీవుడ్ స్టార్స్ నటించిన "మంకీ మ్యాన్" ఏప్రిల్ 5న విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పెళ్లి చేసుకుంటానని.. లైంగికంగా వాడుకున్నాడు.. 20 ఏళ్ల జైలుశిక్ష

No pay no work: జీతం లేనిదే పని చేసేది లేదు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

Adilabad: ఆదిలాబాద్ గ్రామీణ పౌర సంస్థలకు ఎన్నికలు.. ఎప్పుడంటే?

Floods: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 50 ఏళ్ల తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు- భారీ నష్టం

Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్.. పండగ చేసుకుంటోన్న పవన్ ఫ్యాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments