Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుణ్ ఆదిత్య, అప్సర రాణి జంటగా కొత్త సినిమా ప్రారంభం

డీవీ
బుధవారం, 20 మార్చి 2024 (16:34 IST)
Paruchuri Gopalakrishna clapping on Apsara Rani
అరుణ్ ఆదిత్య, అప్సర రాణి జంటగా సినిమా ప్రారంభమయింది. కృష్ణబాబు దర్శకత్వంలో ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. డైరెక్ట‌ర్ వి. సముద్ర తొలిషాట్‌కు గౌరవ దర్శకత్వం వ‌హించ‌గా, ప్ర‌ముఖ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ హీరోయిన్‌పై క్లాప్ కొట్టారు. తొలిషాట్‌కు సంగీత దర్శకురాలు యం యం శ్రీ‌లేఖ కెమెరా స్విచ్చాన్  చేశారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.
 
ఈ సంద‌ర్భంగా డైరెక్టర్ కృష్ణబాబు మాట్లాడుతూ, ఏప్రిల్ 20 నుంచి 10 రోజుల పాటు షెడ్యూల్ చేస్తాం. స‌బ్జెక్టు బాగా వ‌చ్చింది. అరుణ్ ఆదిత్య, అప్సర రాణి జంట‌గా చేస్తున్న‌ ఈ సినిమా ఖ‌చ్చితంగా అంద‌రికి న‌చ్చుతుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తాం..'' అని తెలిపారు.
 
అప్సరరాణి మాట్లాడుతూ... ''మంచి రోజు మంచి సినిమా ప్రారంభమైంది. సంతోషంగా ఉంది. నా కెరీర్‌కు ఈ సినిమా మంచి హెల్ప్ అవుతుంద‌న్న నమ్మకంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్‌కు, డైరెక్ట‌ర్‌కు ధ‌న్య‌వాదాలు..'' అని తెలిపారు.  
 
మ్యూజిక్ డైరెక్టర్ యం యం శ్రీలేఖ మాట్లాడుతూ.. తొలిషాట్‌కు కెమెరా స్విచ్చాన్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా పాటలు చాలా బాగా వ‌చ్చాయి. అంద‌రిని ఆక‌ట్టుకుంటాయి, స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది. అంద‌రికి న‌చ్చుతుంది..'' అని తెలిపారు.
 
ఎగ్జిక్యూటివ్ వెంకటేష్ మాట్లాడుతూ, కృష్ణబాబు స్క్రిప్టును అద్భుతంగా రెడీ చేశారు. ఈ ప్రాజెక్టును ఎంతో నిజాయితీగా, పర్ఫెక్ట్ సిద్ధం చేశారు. హీరో అరుణ్ ఆదిత్య ఈ ప్రాజెక్టుకు దొరికిన ఆణిముత్యం, హీరోయిన్ అప్సర రాణి కూడా నిబ‌ద్ద‌త‌తో, అంకిత‌భావంతో ప‌ని చేసే వ్య‌క్తి. ఆమె డెడికేష‌న్ ఈ సినిమాకు ఎంతో హెల్ప్ అవుతుంది అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేపు లోక్‌సభలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు!!

ఢిల్లీ ఎన్నికలు : కేజ్రీవాల్‌పై మాజీ సీఎం కొడుకు పోటీ!!

గతంలో తెలుగు భాషపై దాడి జరిగింది : మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

రాంగ్ ఫోన్ కాల్ వాజేడు ఎస్ఐ హరీశ్ ప్రాణం తీసింది.. : యువతి అరెస్టు

కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేయడం ఇష్టంలేక.. చేతి వేళ్లను నరుక్కున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments