Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక చిత్రం చరిత్ర సృష్టించడం వేరు.. అదే సినిమా అర్టిస్ట్ జీవితాన్ని మార్చేయడం వేరు...

Advertiesment
paruchuri gopalakrishna

ఠాగూర్

, బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (14:29 IST)
సాధారణంగా ఒక చిత్రం చరిత్ర సృష్టించడం వేరని, అదే సినిమాతో ఆ చిత్రంలో నటించిన ఆర్టిస్ట్ జీవితం మారిపోవడం వేరని, అలాంటి చిత్రానికి పనిచేయడం మా అదృష్టింగా భావిస్తున్నట్టు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఆ చిత్రమే "ఖైదీ" అని, అందులో నటించడం వల్ల చిరంజీవి జీవితమే మారిపోయిందని ఆయన అన్నారు. చిరంజీవికి "పద్మవిభూషణ్" పురస్కారం లంభించడంపై పరుచూరి పలుకులు ద్వారా ఆయన స్పందించారు. చిరంజీవి తన కెరియర్‌ ఆరంభంలో అనేక నెగెటివ్ రోల్స్‌ను సైతం పోషించారని గుర్తుచేశారు. "ఖైదీ" చిత్రం చిరంజీవి జీవితాన్నే మార్చివేసిందన్నారు. ఒక సినిమా చరిత్ర సృష్టించడం వేరని, ఆ సినిమా చేసిన ఆర్టిస్టు జీవితానని మార్చేయడం వేరు. అలాంటి సినిమాకి పనిచేయడం మా అదృష్టంగా మేము భావిస్తున్నట్టు చెప్పారు. 
 
మొన్న జరిగిన పద్మ అవార్డు ఫంక్షన్‌కి రమ్మని చిరంజీవి కాల్ చేస్తే వెళ్లాను. ఒక అత్యున్నతమైన పురస్కారం లభించిన తర్వాత వేసే అడుగులు మరింత జాగ్రత్తగా, ఆదర్శవంతంగా ఉండాలనే ఆయన మాటలు తనకు బాగా నచ్చాయన్నారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలను గురించి చిరంజీవి కొన్ని మాత్రమే చెప్పారని, నిజానికి ఆయన ఎన్నో సేవలు చేశారు.. చేస్తున్నారన్నారు. ఎవరి అండదండలు లేకుండా ఆయన ఈ స్థాయిని చేరుకోవడం నిజంగా గొప్ప విషయమన్నారు. 
 
ఒక్క చిరంజీవి మాత్రమే కాదు.. ఎన్టీఆర్, ఏఎన్నారు, కృష్ణ, శోభన్ బాబు వీళ్లంతా ఆ రోజుల్లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి చరిత్ర సృష్టించారు. తెలుగు ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు అయితే చిరంజీవి త్రినేత్రం వంటివారని తాను చాలా రోజుల క్రితమే చెప్పారనని, ఆ విషయాన్ని ఇటీవల జరిగిన సన్మాన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోమారు చెప్పడం తనను ఆనందాశ్చర్యాలకు గురిచేసిందని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబాయ్‌తో కలిసి నటించాలన్న కోరిక ఉంది.. కానీ మంచి కథ కుదరాలి : వరుణ్ తేజ్