Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెక్స్ స్కామ్‌లో హాలీవుడ్ ప్రముఖుడు... వెలుగులోకి రోజుకో ప్రేమికుడి పేరు

romance

ఠాగూర్

, ఆదివారం, 7 జనవరి 2024 (14:18 IST)
ఎప్‌స్టీన్ ఫైల్స్ బహిర్గతం చేసిన సెక్స్ స్కామ్‌లో రోజుకో ప్రముఖుడి పేరు వెలుగులోకి వస్తుంది. తాజాగా మరో హాలీవుడ్ ప్రముఖుడి పేరు వెలుగులోకి వచ్చింది. శనివారం వెల్లడైన మూడో
దఫా ఫైల్స్‌లో హాలీవుడ్ మాజీ నిర్మాత హార్వే వైన్‌స్టెయిన్ పేరు బహిర్గతమైంది. ఈయన ఇప్పటికే పలువురు మహిళను లైంగికంగా వేధించిన కేసుల్లో జైలుశిక్షను అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈయన పేరు వెల్లడి కావడం గమనార్హం. 
 
వైన్‌స్టెయిన్ 2005లో మార్చిలో ఎప్‌స్టీన్‌ను సంప్రదించినట్లుగా తాజా పత్రాల్లో వెల్లడైంది. 'ఓ అమ్మాయి ఫోన్‌లో మాట్లాడడానికి సిద్ధంగా ఉంది' అని చెబుతున్నట్లు అందులో పేర్కొన్నారు. దీంతో వారివురి మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. తనకు ఇష్టమైన ఓ అమ్మాయితో అమర్యాదగా ప్రవర్తించటంతో వైన్‌స్టెయిన్‌ను ఎప్‌స్టీన్‌ ఫ్రాన్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ నుంచి బయటకు గెంటేసినట్లు తాజా పత్రాల్లో ఉంది. ఇంకెప్పుడూ తనని కలవొద్దని హెచ్చిరించినట్లు రాసుంది.
 
ప్రముఖ పెట్టుబడిదారుడు, సంపన్నుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ శృంగార లీలలపై న్యాయస్థానానికి సమర్పించిన దస్త్రాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. మైనర్‌ బాలికలు, సినీతారలు, మోడళ్లను రంగంలో దించి తన బంగ్లాల్లో వారితో ప్రముఖులు గడిపేలా ఆ వ్యక్తి అన్ని ఏర్పాట్లు చేసేవాడని పలువురి వాంగ్మూలాలు వెల్లడిస్తున్నాయి. ఎప్‌స్టీన్‌ వద్ద పనిచేసినవారు కొన్ని వివరాలు వెల్లడించగా, ఫోన్‌ సందేశాల ప్రతులు మరికొన్నింటిని బహిర్గతం చేస్తున్నాయి. 
 
బాలికలను ఎప్‌స్టీన్‌ తన అవసరాలకు ఎలా ఉపయోగించుకునేవాడో అతని గర్ల్‌ఫ్రెండ్‌ ఘిస్లైన్‌ మాక్స్‌వెల్‌పై దాఖలైన పరువునష్టం కేసులో ఓ బాధితురాలు కొంతమేర బయటపెట్టింది. బ్రిటన్‌ యువరాజు ఆండ్రూ, అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌, బిల్‌ క్లింటన్‌ సహా పలువురు ప్రముఖుల పేర్లు ఈ పత్రాల్లో ఉన్నట్లు బహిర్గతమైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జబర్దస్త్ కమెడియన్ ఇంట్లో విషాదం...