Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్‌గా మళ్ళీ రాణిస్తానంటున్న 40 యేళ్ళ నటి

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (19:29 IST)
సిమ్రాన్. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, ఉర్దూ బాషలలో వివిధ చిత్రాల్లో నటించింది సిమ్రాన్. తెలుగులో అయితే అగ్రహీరోలందరితోను నటించి మెప్పించింది. సిమ్రాన్ అంటే ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు సినిమా థియేటర్ల ముందు క్యూకట్టేవారు. ఆమె నటన అంటే అంత ఇష్టపడేవారు. అయితే తన చిన్ననాటి స్నేహితుడితో పెళ్ళి చేసుకున్న తరువాత సిమ్రాన్ సినిమాలకు దూరమయ్యారు.
 
అయితే 40 యేళ్ళ తరువాత అంటే సరిగ్గా గత యేడాది ఆమె రజినీకాంత్‌తో కలిసి ఒక సినిమాలో నటించారు. మళ్ళీ ఏ సినిమాల్లో నటించలేదు. కానీ కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ కొనసాగుతుండడం.. ఇదంతా పూర్తయిన తరువాత మళ్ళీ సినిమాల్లో నటిస్తానంటోంది సిమ్రాన్. అది కూడా యువ నటులతోనే అంటోంది సిమ్రాన్.
 
హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లోనే నటిస్తానని దర్సకనిర్మాతలకు చెబుతోందట సిమ్రాన్. ఆమె కోసం తమిళంలో ఇప్పటికే ఖష్బూ భర్త సుందర్ సి. ఒక కథ కూడా సిద్థం చేసినట్లు తెలుస్తోంది. సిమ్రాన్‌కు గతంలో ఉన్న క్రేజ్ ఒక్కసారిగా రావడానికి ఈ సినిమా బాగా సహకరిస్తుందంటున్నాడట సుందర్ సి.
 
అంతేకాదు సుందర్ చెప్పిన కథ సిమ్రాన్‌కు బాగా నచ్చిందట. ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని సిమ్రాన్ ఆసక్తిగా ఎదురుచూస్తోందట. లాక్ డౌన్ ఎంత త్వరగా పూర్తయితే మళ్లీ మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వెళ్ళిపోవాలని ఎంతో ఉత్సాహంగా ఉందట సిమ్రాన్. మరి చూడాలి సిమ్రాన్‌కు ఏ విధంగా సినిమాలు కలుసొస్తాయన్నది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments