Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌వితేజ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (20:24 IST)
మాస్ మహారాజా రవితేజ 66వ సినిమాను దీపావళి సందర్భంగా ఈమధ్యే ప్రకటించారు. కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. డాన్ శీను, బలుపు లాంటి రెండు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించబోతున్నారు. 
 
2017లో తెలుగు సినిమాలో నటించారు శృతి హాసన్‌. ఇప్పుడు రవితేజ సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తున్నారని చెబుతోంది చిత్ర యూనిట్. రవితేజ, శృతి హాసన్ కలిసి నటించబోయే రెండవ సినిమా ఇది. బలుపులో ఇప్పటికే ఓసారి నటించారు ఈ జోడీ. ఆ సినిమాను కూడా గోపీచంద్ మలినేని తెరకెక్కించడం విశేషం. ఆ సినిమా మంచి విజయం సాధించింది. 
 
ప్రస్తుతం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మంచి కథను సిద్ధం చేస్తున్నారు దర్శకుడు గోపీచంద్. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పవర్‌ఫుల్ పోలీస్ కథతో వస్తున్నారు గోపీచంద్ మలినేని. బి మధు ఈ చిత్రానికి నిర్మాత. నవంబర్‌లో సినిమా ఓపెనింగ్ జరగనుంది. మిగిలిన వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పబ్లిక్‌లో ఇదేమీ విడ్డూరంరా నాయనో (Video)

కత్తితో బెదిరించి విమానం హైజాక్‌కు దుండగుడు యత్నం... చివరకు ఏమైంది?

అమరావతిలో దేశంలోనే అతిపెద్ద ఎన్టీఆర్ విగ్రహం.. నరేంద్ర మోదీ పర్మిషన్ ఇస్తారా?

కుక్కల సతీశ్ ఇంట్లో ఈడీ సోదాలు... రూ.50 కోట్ల శునకం ఉత్తుత్తిదేనట

పవన్ కల్యాణ్ చిన్న కుమారిడిపై పరోక్షంగా కామెంట్లు చేసిన రోజా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments