Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి చిత్రంలో కండల వీరుడు... 'లూసీఫర్' రీమేక్‌లో...

Webdunia
ఆదివారం, 3 మే 2020 (13:27 IST)
మెగాస్టార్ చిరంజీవి వెండితెర రీ ఎంట్రీ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతోంది. ఖైదీ నంబర్ 150 తర్వాత ఆయన వరుసబెట్టి చిత్రాలు చేస్తున్నారు. అలాగే, ఆయన కాల్షీట్ల కోసం నిర్మాతలు, దర్శకులు క్యూకడుతున్నారు. ఈపరిస్థితుల్లో ప్రస్తుతం చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో ఆచార్య అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయింది. పరస్థితులన్నీ చక్కబడిన ర్వాత ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది. 
 
అయితే ఈ లాక్‌డౌన్ సమయంలో చిరంజీవి చేయబోయే చిత్రాల గురించి స్వయంగా మెగాస్టారే క్లారిటీ ఇచ్చి ఉన్నారు. ఆచార్య చిత్రం తర్వాత 'లూసీఫర్' రీమేక్‌లో చేస్తున్నానని, దానికి 'సాహో' దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తాడని తెలిపారు. ప్రస్తుతం సుజీత్ ఈ చిత్రాన్ని తెలుగు నెటీవిటీకి అనుగుణంగా మారుస్తున్నారని కూడా క్లారిటీ ఇచ్చేశారు. అలాగే, మరికొందరు యువ దర్శకుల కాంబినేషన్‌లో కూడా ఆయన నటించనున్నారు. 
 
అయితే, లూసీఫర్ చిత్రంపై తాజాగా ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఓ కీలకపాత్రను చేయబోతున్నారట. 'లూసీఫర్' చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ ఆ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటించారు. మోహన్‌లాల్‌కు సపోర్ట్‌గా ఉండే ఆ పాత్ర సినిమాకి ఎంతో ముఖ్యమైనది. ఆ పాత్రలో సల్మాన్ ఖాన్‌ని నటింపజేయాలని చూస్తున్నారట. 
 
ఎందుకంటే చిరంజీవి వెండితెర రీ ఎంట్రీ చిత్రం "ఖైదీ నంబర్ 150"లో వెంకటేష్, సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేయాలని అనుకున్నారట. కానీ ఆ విషయం మూవీ రిలీజ్ తర్వాత చిరంజీవికి తెలియడంతో ఎంతో ఫీల్ అయ్యారట. అందుకే ఈ చిత్రంలో సల్మాన్‌ని నటింపజేయాలని చిరంజీవి కూడా కోరారని అంటున్నారు. నిజానికి ఆ పాత్రలో సల్మాన్ కూడా చక్కగా సరిపోతారు. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందన్నది తెలియాలంటే మరోమారు మెగాస్టార్ ట్విట్టర్ పిట్ట కూత పెట్టాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments