Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిపల్లవి పట్టిందల్లా ఫ్లాపే... ఎందుకలా?

Webdunia
శనివారం, 8 జూన్ 2019 (16:33 IST)
సాయిపల్లవి తెలివైన అమ్మాయి... పట్టిందల్లా బంగారమే. ఏరి కోరి హిట్ కథలనే ఎంచుకుంటోది. కానీ ఇప్పుడు రివర్స్‌లో వెళుతోంది. పట్టిందల్లా ఫ్లాపే అవుతోంది. ఎందుకిలా జరుగుతోంది. ఆ జడ్జ్‌మెంట్ ఏమైంది.
 
సాయిపల్లవి ఎం.బి.బి.ఎస్. చదువుతున్న సమయంలో మళయాళ సినిమా ప్రేమంతో ఎంట్రీ ఇచ్చింది. తొలి అడుగులోనే సూపర్ హిట్‌ను అందుకుంది. ఆ మరుసటి సంవత్సరం తమిళంలో దుల్హర్ సల్మాన్‌తో జతకట్టి కాలితో సక్సెస్‌తో కంటిన్యూ చేసింది. మళయాళం, తమిళంలో పాటు సాయిపల్లవి తెలుగు ప్రయాణం కూడా సక్సెస్‌తో మొదలైంది.
 
తనదైన ఫర్మాన్సెస్‌తో, ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో తెలుగు ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసి క్రేజీ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఆ వెంటనే నటించిన ఎం.సి.ఎ. మూవీతో సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది సాయిపల్లవి.
 
సక్సెస్‌తో ప్రారంభమైన సాయిపల్లవి జర్నీ ప్రస్తుతం ఫ్లాప్‌లతో నడుస్తోంది. ఎంసిఎ తరువాత నటించిన కణం, పడిపడిలేచే వయస్సు నిరాశపరిచాయి. తమిళంలోను ఇదే పరిస్థితి. ధనుష్‌తో జతకట్టిన మారి-2, సూర్యతో నటించిన ఎన్‌జికే సక్సెస్ అవ్వలేదు. సినిమా కథ, ముఖ్యంగా తన పాత్ర నచ్చితే గానీ ఓకే చెయ్యదు సాయిపల్లవి.
 
ఇలా మనస్సుకు నచ్చని చాలా క్రేజీ ప్రాజెక్టులను వదిలేసుకుంది. పోనీ ఎంచుకున్న సినిమాలన్నా హిట్ అవుతున్నాయంటే అదీ లేదు. కథను జడ్జ్ చేయలేక ఏరికోరి ఫ్లాపయ్యే మూవీస్‌నే ఎంచుకుంటోంది. ప్రస్తుతం రానాతో జతకడుతున్న సినిమా అయినా సక్సెస్ అవుతుందో లేదో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)

పవన్ కల్యాణ్ అడివి తల్లి బాట.. ప్రత్యేక వీడియోను విడుదల చేసిన జనసేన (video)

భారతదేశానికి తహవ్వూర్ రాణా.. భద్రత కట్టుదిట్టం.. విచారణ ఎలా జరుగుతుందంటే?

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతరం లేక?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments