Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సాయి పల్లవితో నాగ శౌర్య‌కు అలాంటి అనుభవం, శ‌ర్వానంద్‌కు ఇలాంటి...

Advertiesment
సాయి పల్లవితో నాగ శౌర్య‌కు అలాంటి అనుభవం, శ‌ర్వానంద్‌కు ఇలాంటి...
, సోమవారం, 17 డిశెంబరు 2018 (10:56 IST)
నాగ శౌర్య‌కు శ‌ర్వానంద్ కౌంట‌ర్ ఇవ్వ‌డం ఏంటి..? అస‌లు వీరి మ‌ధ్య ఏం జ‌రిగింది.? అనుకుంటున్నారా..? విష‌యం ఏంటంటే.. హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి హీరో నాగ శౌర్య క‌లిసి క‌ణం అనే సినిమా చేసారు. ఈ సినిమా టైమ్‌లో వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆత‌ర్వాత నాగశౌర్య సాయి ప‌ల్ల‌వి గురించి మాట్లాడుతూ.. సెట్స్‌కి టైమ్‌కి రాదు. ఇగో ఎక్కువ అని చెప్పాడు. ఇక ఎప్పుడూ త‌న‌తో న‌టించ‌ను అని కూడా చెప్పేసాడు.
 
ఇదిలా ఉంటే.. శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి క‌లిసి ప‌డిప‌డి లేచె మ‌న‌సు సినిమా చేసారు. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా శ‌ర్వానంద్ మాట్లాడుతూ.. సాయి ప‌ల్ల‌విపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. ఆమెకు అస‌లు ఇగో లేద‌ని.. చాలా నేచుర‌ల్‌గా న‌టిస్తుంద‌ని చెప్పాడు. అంతేకాకుండా... ఆమె గురించి ఏదేదో విన్నాను. అదంతా త‌ప్ప‌ని తెలిసింది. ఆమెలా నేను న‌టించ‌లేన‌ని చెప్పేసాడు. సో... ఈ విధంగా బ‌య‌ట‌కు చెప్ప‌క‌పోయినా నాగశౌర్య‌కు బాగానే కౌంట‌ర్ ఇచ్చాడు. అదీ.. సంగ‌తి!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీవీ సింధు విజయంపై స్పందించిన సూప‌ర్ స్టార్