టాలీవుడ్‌లో మకుటంలేని మహారాజు ఎవరు? రవితేజ చెప్పిన ఆన్సర్ ఏంటి?

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (11:56 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్రహీరోల్లో చిరంజీవి ఒకరు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉన్నారు. అలాంటి చిరంజీవి గురించి మాస్ మహాజారాగా గుర్తింపు పొందిన రవితేజ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 
 
అరవై యేళ్ళ వయస్సులో కూడా కుర్ర హీరోల‌తో పోటీపడుతూ చిత్రాలు చేస్తున్న చిరంజీవి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సొంతం చేసుకున్నారు. త్వ‌ర‌లో త‌న 152వ సినిమ‌తో ప‌ల‌క‌రించ‌నున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
అలాంటి చిరంజీవిపై మరో టాలీవుడ్ హీరో ర‌వితేజ ప్ర‌శంస‌లు కురిపించారు. రవితేజ నటించిన తాజా చిత్రం డిస్కోరాజా. ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రంలో నేనంటే 35 ఏళ్ళు ఐస్‌లో గడ్డ క‌ట్టేసేలా ఉన్నాను. ఆయ‌నేంటి ఇంకా అలానే ఉన్నారు అని ర‌వితేజ‌.. వెన్నెల కిషోర్‌తో చెబుతాడు. 
 
దీనికి వెన్నెల కిషోర్ ఐస్‌లో కాదు ఫ్యాన్స్ గుండెల్లో ఉన్నాడ‌ని అంటాడు. దీనికి సంబంధించిన డైలాగ్ వీడియోని చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈ వీడియో నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటుంది. వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన డిస్కోరాజా చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించ‌గా, ఈ చిత్రం మ‌రిన్ని వ‌సూళ్ళు రాబ‌ట్టేందుకు మేక‌ర్స్ వినూత్న ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments