Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో '2.0' భారీ రిలీజ్.. 16 వేల థియేటర్స్‌లో స్క్రీనింగ్

'బాహుబలి ది బిగినింగ్' సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శక ధీరుడు రాజమౌళి 'బాహుబలి ది కంక్లూజన్'తో టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రపంచానికే పరిచయం చేశాడు. ఓ తెలుగు సినిమా ఇలాంటి ఘనత సాధిస్తుందని ఎవరు

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (15:54 IST)
'బాహుబలి ది బిగినింగ్' సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శక ధీరుడు రాజమౌళి 'బాహుబలి ది కంక్లూజన్'తో టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రపంచానికే పరిచయం చేశాడు. ఓ తెలుగు సినిమా ఇలాంటి ఘనత సాధిస్తుందని ఎవరు ఎప్పుడు ఊహించలేదు కూడా. ఏ ఇండియన్ సినిమా సాధించని రికార్డు బాహుబలి 2 సాధించి అందరు ముక్కున వేలేసుకునేలా చేసింది. ఏకంగా రూ.2 వేల కోట్ల‌ు వ‌సూళ్ళు సాధించింది.
 
ఈ క్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.0 చిత్రం చైనాలో రిలీజ్ కానుంది. నిజానికి చైనాలో భారతీయ సినిమాలను రిలీజ్ చేయాలంటే అందుకు ఒక ప్రాతిపదిక ఉంటుంది. ఒక యేడాదికి ఇన్ని భారతీయ సినిమాలను మాత్రమే అక్కడ విడుదల చేయాలంటూ అక్కడి ప్రభుత్వం అనుమతినిస్తుంది. ఆ రేషన్‌లో అక్కడ విడుదలైన 'దంగల్' వసూళ్ల పరంగా ఎలాంటి రికార్డును సృష్టించిందో తెలిసిందే. ఆ తర్వాత రజనీ తాజా చిత్రం '2.0' కి అక్కడ ప్రదర్శించడానికి అనుమతి లభించింది.
 
వచ్చే ఏడాది ఈ సినిమాను అక్కడ విడుదల చేయడానికి ముందుగానే బెర్త్‌ను ఖరారు చేసుకున్నారు. చైనాలోను రజనీకాంత్ కి పెద్ద సంఖ్యలోనే ఫ్యాన్స్ ఉన్నారు. అందువలన ఈ సినిమాను అక్కడ దాదాపు 16 వేల థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్టు సమాచారం. ఐ మ్యాక్స్ వెర్షన్‌తో పాటు త్రీడీ వెర్షన్‌ను కూడా విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా అక్కడ ఏ రేంజ్‌లో దూసుకుపోతుందో .. ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందో వేచి చూడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments