రజినీతో జట్టు కట్టేందుకు సిద్ధం : కమల్ హాసన్ ప్రకటన
ఇద్దరు రాజకీయ ఉద్ధండులు కరుణానిధి, జయలలితలు పూర్తిగా కనుమరుగైన నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల సరళి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా అన్నాడీఎంకే ప్రభుత్వంపై రోజురోజుకూ అవినీతి ఆరోపణలు పెరిగిపోతున్నాయి. అలాగ
ఇద్దరు రాజకీయ ఉద్ధండులు కరుణానిధి, జయలలితలు పూర్తిగా కనుమరుగైన నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల సరళి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా అన్నాడీఎంకే ప్రభుత్వంపై రోజురోజుకూ అవినీతి ఆరోపణలు పెరిగిపోతున్నాయి. అలాగే, మాటలతో దాడిచేసే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.
ఈ విషషయంలో తమిళ హీరో కమల్ హాసన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇందులోభాగంగా, ఆయన త్వరలోనే రాజకీయా పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటన తమిళనాడు రాజకీయాల్లో ఓ ప్రకంపనలు సృష్టించింది.
ఈ నేపథ్యంలో, సూపర్‌స్టార్ రజనీకాంత్ ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మరో విశ్వనటుడు ప్రకటించారు. తన రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లో రజనీతో కలిసి పనిచేస్తారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కమల్ సమాధానమిస్తూ... ఒకవేళ రాజకీయాల్లో రజనీ వస్తే, ఆయనతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తమిళనాడులో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కమల్ పార్టీ రాజకీయ ప్రవేశం చేసే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి.