Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.4 కోట్లిస్తే వస్తానంటున్న 'జిగేల్ రాణి'

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (08:43 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో పట్టిందల్లా బంగారంగా మారిన హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఈ భామ నటించిన ప్రతి చిత్రం సూపర్ హిట్టే. గత యేడాదిలాగానే ఈ యేడాది కూడా ఈ భామకు బాగా కలిసివచ్చింది. ఫలితంగా టాప్ గేర్‌లో దూసుకెళుతోంది. వరుస అవకాశాలతో బిజీగా గడుపుతోంది. దీంతో తన పారితోషికాన్ని కూడా అమాంతం పెంచేసింది. 
 
గత సంక్రాంతికి విడుదలైన అల.. వైకుంఠపురంలో చిత్రంతో ఈ భామ క్రేజ్‌ ఆకాశానికి చేరిపోయింది. ఈ చిత్రం కోసం 2 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్న ఈ అందాలభామ ఇప్పుడు తెలుగులో రూ.3 కోట్లు డిమాండ్ చేస్తోందట. 
 
ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌ సరసన ‘జాన్‌', అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' చిత్రంలో నటిస్తున్న పూజాకు తెలుగులోనే కాదు బాలీవుడ్‌లో కూడా మంచి పాపులారిటీ సంపాందించుకుంది.
 
ఇటీవల ‘హౌజ్‌ఫుల్‌-4’ చిత్రంలో బాలీవుడ్‌ జనాలను ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు సల్మాన్‌ఖాన్‌తో నటించనున్న ‘కబీ ఈద్‌ కబీ దివాళీ’ చిత్రానికి రూ.4 కోట్ల పారితోషికం డిమాండ్‌ చేసిందట. 
 
ఇక పూజా హెగ్డేకు వున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ చిత్ర నిర్మాత సాజిద్‌ నడియాలా కూడా ఆమె డిమాండ్‌కు అంగీకరించాడని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. గతంలో పడిన ఐటం గర్ల్ అనే ముద్రను చెరిపేసుకుంటూ ముందుకుసాగిపోతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments