పూజా హెగ్డేకు కరోనా భయం... ముఖానికి మాస్క్‌తో ఫోజులు

శనివారం, 14 మార్చి 2020 (13:10 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో టాప్ గేర్‌లో దూసుకెళుతున్న హీరోయిన్ పూజా హెగ్డే. ఈ బాలీవుడ్ భామకు పట్టినంత అదృష్టం తెలుకులో మరో హీరోయిన్‌కు పట్టలేదని చెప్పొచ్చు. ఈమె చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతోంది. దీంతో ఆమె కోసం దర్శక నిర్మాతలు క్యూకడుతున్నారు. అదేసమయంలో ఈ అమ్మడు కూడా వచ్చిన అవకాశాలను ఏమాత్రం వదులుకోవడం లేదు. ఆఫర్ వచ్చిన ప్రతి సినిమాకు సైన్ చేస్తోంది. దీంతో వివిధ ప్రాంతాలకు చక్కర్లు కొడుతోంది.
 
అదేసమయంలో ఈమె తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. తాజాగా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ హీరో ప్రభాస్ కూడా మాస్కుతో ఎయిర్‌పోర్టులో కనిపించారు. ఇపుడు పూజా హెగ్డే కూడా ఇపుడు కరోనా వైరస్ దెబ్బకు ముఖానికి మాస్క్ కట్టుకుని తిరుగుతోంది. 
 
ఈమె ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి నటిస్తోంది. ఈ చిత్ర యూనిట్ జార్జియాలో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఇప్ప‌టికే ప్ర‌భాస్ ఇత‌ర యూనిట్ అక్క‌డ చేరుకోగా ఇప్పుడు పూజా హెగ్డే యూనిట్‌తో జాయిన్ అయ్యింది. ఇస్తాంబుల్ మీదుగా పూజా హెగ్డే జార్జియా చేరుకుంది. ఇస్తాంబుల్‌లో క‌రోనాకు భ‌య‌ప‌డి పూజా హెగ్డే మాస్క్ ధ‌రించింది. 
 
ఆ ఫొటోను పూజా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటో నెట్టింట్లో వైర‌ల్ అవుతుంది. రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు. ఈ చిత్రానికి 'ఓ డియ‌ర్‌', 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం చిరంజీవికి షాకిచ్చిన చెన్నై చిన్నది ... 'ఆచార్య'కు గుడ్‌బై