పీకల్లోతు ప్రేమలో బుట్టబొమ్మ?

బుధవారం, 18 మార్చి 2020 (20:24 IST)
ప్రస్తుతం పూజా హెగ్డే పేరు టాలీవుడ్లో మారుమోగిపోతోంది. వరుస హిట్లతో దూసుకుపోతోంది. ఒక్క టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లో కూడా పూజా హవా నడుస్తోంది. అక్కడ రెండు సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో కూడా రెండు సినిమాలు చేస్తోంది.
 
అంత బిజీ షెడ్యూల్లోనూ పూజా ప్రేమలో పడిందన్న ప్రచారం ఇప్పుడు బాగానే వినిపిస్తోంది. పూజా ప్రేమలో పడింది ఎవరితోనో కాదు బాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరో తనయుడితోనట. గత సంవత్సరం నుంచి బాలీవుడ్ మూవీ బజార్ చిత్రంతో పాపులరైన సీనియర్ స్టార్ వినోద్ మెహ్రో కుమారుడు రోహన్ వినోద్ మెహ్రాతో పూజా ప్రేమలో పడిందట.
 
వీరిద్దరూ సమయం దొరికినప్పుడల్లా చెట్టాపట్టాలేసుకుని తెగ తిరిగేస్తున్నారట. కాకపోతే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు వీరిద్దరు ప్రయత్నిస్తున్నారట. కానీ తెలిసిందేగా ఏ విషయమైనా మీడియాకు అలా తెలిసిపోతుందని. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అదే కొండంత అండ - అదే శ్రీరామరక్ష- మోహన్ బాబు