Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్ ఫ్రెండ్‌తో అందుకు ఒప్పేసుకున్న నయనతార...

Webdunia
గురువారం, 2 మే 2019 (18:44 IST)
నయనతార ప్రస్తుతం రజినీకాంత్ సరసన దర్బార్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా పూర్తయిన తరువాత ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టబోతోందా...? ఈ ప్రశ్నకు నయనతార కాకుండా ఆమె బాయ్ ఫ్రెండే సమాధానమిచ్చారు.
 
సినిమా ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్, ప్రభాస్ పెళ్ళిళ్లు ఎప్పుడు జరుగుతాయంటూ వచ్చిన వార్తలు మరెవ్వరి విషయంలో రాలేదు. ఆ తరువాత ఆ రేంజ్ చర్చ జరిగింది నయనతార పెళ్ళి గురించే. గత రెండుమూడేళ్ళుగా నయనతార పెళ్ళి డేట్ ఇదే అంటూ అనేక పుకార్లు, షికార్లు చేశాయి. కానీ ఇప్పటివరకు ఆమె పెళ్ళి చేసుకోలేదు.
 
నయనతార, ప్రభుదేవాలు పెళ్ళి చేసుకోవాలని పెళ్ళి కూడా ఫిక్స్ చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో ప్రభుదేవా హ్యాండ్ ఇచ్చాడు. చాన్నాళ్ళు నయనతార ఆ షాక్‌లోనే ఉండిపోయింది. మూడేళ్ళ క్రితం విఘ్నేష్ శివంతో ప్రేమలో పడింది. అప్పటి నుంచి వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు. విఘ్నేష్ శివంతో తన అనుబంధం గురించి మొదట్లో పెదవి విప్పలేదు నయనతార. కానీ గత యేడాది నుంచి మాత్రం ఆమె తన రిలేషన్‌ను దాచుకోలేదు.
 
ఇద్దరూ కలిసి అనేక ప్లేస్‌లకు టూర్లు వేశారు. సినిమా ఫంక్షన్లకు కలిసే వెళుతున్నారు. ఎక్కడికైనా వీరి గురించి రహస్యమేమీ లేదు. వీరిద్దరికీ ఇప్పటికే సీక్రెట్ నిశ్చితార్థం జరిగిందని ప్రచారం కూడా ఉంది. అయితే ఇప్పటివరకు వీరిద్దరు స్పందించలేదు. తాజాగా నయనతార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ ఒక హింట్ ఇచ్చాడు. ఈ యేడాది తన పెళ్ళి గ్యారంటీగా జరుగుతుందన్నట్లుగా మాట్లాడాడు. అంటే నయనతార, విఘ్నేష్‌ల పెళ్ళి త్వరలో జరుగనుందన్నమాట. కానీ సల్మాన్ ఖాన్, ప్రభాస్‌ల గురించి మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. నయనతార పెళ్ళి పుకార్లకు మాత్రం త్వరలోనే ఎండ్ కార్డు పడేట్లుగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెప్సికో ఇండియా రివల్యూషనరి అవార్డ్స్ 2024: విజేతగా నిలిచిన తెలంగాణ గణపతి సెల్ఫ్-హెల్ప్ గ్రూప్

తిరుపతిలో అన్నమయ్యకి శాంతాక్లాజ్ టోపీ పెట్టింది ఎవరో తెలిసిపోయింది (video)

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments