Webdunia - Bharat's app for daily news and videos

Install App

జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక సుకుమార్ ఉన్నాడని తెలిపిన నట్టికుమార్, ఛాంబర్ కమిటీ ?

డీవీ
శనివారం, 21 సెప్టెంబరు 2024 (16:13 IST)
Jany, Jhansi
తాజా ఉదంతాలను బట్టి జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక పుష్ప 2 దర్శకుడు సుకుమార్ ప్రమోయం వుందని జానీ మాస్టర్ భార్య సుమలతతోపాటు నిర్మాత నట్టికుమార్, ఛాంబర్ కమిటీ కన్వీనర్ ఝాన్సీ, ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ కూడా తెలియజేశారు. పుష్ప 2 సినిమాలో ప్రత్యేక సాంగ్ కు జానీ మాస్టర్ ను అల్లు అర్జున్, సుకుమార్ సంప్రదించారట. డాన్స్ మూవ్ మెంట్ విషయంలో తేడా రావడంతో జానీ మాస్టర్ తప్పుకున్నాడు. ఆ టైంలో ఆయన శిష్యురాలు ఎంట్రీ ఇచ్చిందట.
 
జానీని మొదట్లో అల్లు అర్జున్ వద్దన్నాడు.  తర్వాత తప్పుతెలుసుకుని క్షమాపణ చెప్పాడు
 
అంతకుముందు అల వైకుంఠపురంలో.. బుట్టబొమ్మ... సాంగ్ ను కూడా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఆ సాంగ్ విషయంలో అల్లు అర్జున్ కు మూవ్ మెంట్ నచ్చకపోవడంతో డాన్స్ వేయకుండా వెళ్ళిపోయాడు. అసలు అల్లు అర్జున్ కు ఏమి కావాలో తెలుసుకున్న జానీ మాస్టర్ తమిళ్ లో ఫేమస్ హీరో చేసిన మూవ్ మెంట్ చూపిస్తూ ఇలా కావాలని అడిగాడట. అందుకు జానీమాస్టర్ ఆ మూవ్ మెంట్ నేనే చేశాను సార్. అని చెప్పడంతో తగ్గెదేలే అన్న మనిషి తగ్గి బుట్టబొమ్మ పాట చేశాడు. అది జాతీయస్థాయిలో పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ సారీ అని కూడా జానీ కి చెప్పాడని అప్పట్లో ఆ డాన్స్ కు పనిచేసిన పలువురు డాన్సర్స్ నేడు బయట పెట్టారు. 
 
పుష్ప 2 వివాదం ఎలా వచ్చిందంటే..
జానీ మాస్టర్ కూ, ఆయన శిష్యురాలు స్రష్టి వర్మకు ఇటీవల కాలంలో కొంచెం చెడింది. ఒకరంగా చెప్పాలంటే తనే వ్యక్తిగతంగా ఎదగాలనుకుంటుంది. అలాంటి టైంలో పుష్ప 2కు కొత్త మూవ్ మెంట్ కోసం సుకుమార్ జానీ మాస్టర్ ను సంప్రదించడంతో అల్లు అర్జున్ చెప్పిన మూవ్ మెంట్స్ విషయంలో కొంచెం చర్చ జరిగింది. ఆ తర్వాత జానీ మాస్టర్ తాను చేయనని బయటకు వచ్చేశాడు. సరిగ్గా ఇదే టైంలో ఆయన శిష్యురాలు స్రష్టి వర్మను దర్శకుడు సుకుమార్ పిలవడం, అవకాశం ఇవ్వడం జరిగాయి. ఇది తెలిసిన జానీ మాస్టర్ సెట్లో నే ఆమెను నిలదీస్తే, వారిధ్దరి మధ్య పెద్ద వాగ్వివాదం జరిగింది. దాంతో మాటామాటా పెరిగి నువ్వెంత.. నువ్వెంత.. తగ్గేదేలా అన్నట్లుగా మారింది. 
 
ఈ విషయాలన్నీ తెలిసిన ఇండస్ట్రీ పెద్దలు అసలు జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక ఓ ప్రముఖ హీరో, దర్శకుడు వున్నాడని ఇటీవలే ఛాంబర్ లో ఝాన్సీ కూడా చెప్పింది. జానీ మాస్టర్ భార్య అయితే ఏకంగా సుకుమార్ పేరు బయటపెట్టింది. ఇంతవరకు ఇష్యూ రావడానికి కారణం ఎవరికి వారు తగ్గేదేలా అన్నట్లు వ్యవహరించడమే కారణంగా తెలుస్తోంది. ఆ ఫాట వరకు ఆమెను వదిలేసి వుంటే జానీ మాస్టర్ కేసు వరకు వెళ్లేది కాదు. విశ్వసనీయ సమాచారం మేరకు సుకుమార్ అండతో పోలీస్ కేసు వరకు స్రష్టి వర్మ వెళ్ళిందని తెలుస్తోంది. దీనిపై పోలీసులు, కోర్టులు నిజానిజాలు వెలికితీస్తే మరిన్ని వివరాలు తెలియగలవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ, తెలంగాణల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

జంతువుల కొవ్వు, చేప నూనె.. తిరుపతి లడ్డూపై బండ్ సంజయ్ ఏమన్నారు?

పాట్నా ఎన్ఐటీ‌లో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం

రితిక టిర్కి అదిరే రికార్డ్.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు లోకో పైలట్‌ (video)

పార్ట్‌టైమ్ ఉద్యోగం కోసం మహిళ లింక్ క్లిక్ చేసింది.. అంతే రూ. 4.72 లక్షలు స్వాహా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

అంజీర మిల్క్ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments