Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని వి స్టోరీ లీకైంది, మొత్తం కథ ఇదేనట

Webdunia
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (20:49 IST)
నేచరల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ వి. ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో నాని విలన్‌గా నటిస్తుంటే... సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఇప్పటివరకు హీరోగా నటించిన నాని ఈ సినిమాలో విలన్‌గా నటించడం విశేషం. 
 
ఈ సినిమా టైటిల్ వి కావడంతో వి అంటే విలన్ అంటూ ప్రచారం జరిగింది కానీ.. అది కాదని తెలిసింది. ఇంతకీ లీకైన స్టోరీ ఏంటంటే.... నాని ఈ సినిమాలో వరుసగా హత్యలు చేస్తుంటాడని.. హత్య చేసిన తర్వాత డెడ్ బాడీ దగ్గర వి అనే అక్షరం పెడుతుంటాడని.. ఈ విధంగా పోలీసులకు హింట్ ఇస్తాడని తెలిసింది. ఈ హింట్‌తో పోలీసైన సుధీర్ బాబు నానిని పట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు. 
 
ఇంతకీ వి అంటే ఏంటి..? ఎందుకు డెడ్ బాడీ దగ్గర వి అనే అక్షరం పెడుతున్నాడు.? వి అక్షరానికి నానికి ఉన్న సంబంధం ఏంటి..? అనేది చివర వరకు సస్పెన్స్‌గా ఉంటుందని.. ప్రతి సన్నివేశం చాలా ఇంట్రస్టింగ్‌గా.. నెక్ట్స్ సీన్లో ఏం జరుగుతుందో అనే ఆసక్తితో చూసేలా ఈ సినిమా ఉంటుంది.
 
ఇందులో నివేథా థామస్, అదితిరావు హైదరీ నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, నాజర్, ప్రియదర్శి, అవసరాల శ్రీనివాస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నాని, సుధీర్ బాబు బ్రదర్స్‌గా నటిస్తున్నారని.. నాని సైకో కిల్లర్‌గా హత్యలు చేస్తుంటే వాటిని ఆపేందుకు సుధీర్ బాబు ప్రయత్నిస్తుంటాడని తెలిసింది.

వీరిద్దరిపై చిత్రీకరించిన సన్నివేశాలు ఎమోషనల్ గాను ఇంట్రస్టింగ్ గాను ఉంటాయని.. ఆడియన్స్‌కి థ్రిల్ కలిగించే సినిమా అవుతుందని.. ఈ సినిమా కథ ఇదే అంటూ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ సినిమాని ఉగాది కానుకగా మార్చి 25న రిలీజ్ చేయనున్నారు. మరి... లీకైన కథ వాస్తవమేనా కాదా అనేది తెలియాలంటే మార్చి 25 వరకు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

పని పురుగులా మారిపోయా, నా ముక్కు నుంచి రక్తం పడింది: బెంగళూరు CEO

సీఎం మమతకు షాకిచ్చిన సుప్రీంకోర్టు - 25 వేల టీచర్ నియామకాలు రద్దు

టైంపాస్ పనులేంటి అంటూ పవన్‌పై ప్రకాష్ రాజ్ మండిపాటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments