Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వైరస్‌కు మందు... ఖాళీ కడుపుతో మూడు రోజులు ఆ మందు తీసుకుంటే...

కరోనా వైరస్‌కు మందు... ఖాళీ కడుపుతో మూడు రోజులు ఆ మందు తీసుకుంటే...
, గురువారం, 30 జనవరి 2020 (10:07 IST)
చైనాతో పాటు పలు దేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్‌కు ఇంగ్లీష్ వైద్యంలో చికిత్స లేదు. దీంతో ఈ వైరస్ బారినపడినవారిలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పైగా, ఈ వైరస్ భారత్‌లోకి కూడా ప్రవేశించినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. 
 
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను నిరోధించేందుకు కేంద్ర ఆయుష్ శాఖ.. హోమియోపతి, యునాని వైద్యంతో చెక్ పెట్టొచ్చని పేర్కొంది. ఈ వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తగా హోమియోపతి, యునాని వైద్యం పనిచేస్తుందని పేర్కొంది. కరోనా వైరస్ ప్రభావాన్ని నిరోధించేందుకు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి సలహా మండలి భేటీ అయింది.
 
ఈ సందర్భంగా హోమియోపతి మందు 'ఆర్సినికం ఆల్బమ్ 30' ను ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో మూడురోజులు తీసుకోవడం ద్వారా కరోనా నుంచి రక్షణ పొందవచ్చని భేటీలో వైద్యులు అభిప్రాయపడ్డారు. ఈ మందు రోగ నిరోధక ఔషధంగా పనిచేస్తుందని వారు పేర్కొన్నారు. నెల రోజుల తర్వాత కూడా కరోనా వైరస్ ఇంకా వ్యాప్తిలో ఉంటే మరోసారి ఇదే మందును మూడు రోజులు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు.
 
ఇకపోతే.. కొన్నిపాటి ఆయుర్వేద చిట్కాలు కూడా ఈ వైరస్ నివారణకు పని చేస్తుదని సూచన చేసింది. ముఖ్యంగా, ఆయుర్వేద, యునానీ కషాయాలు పనిచేస్తాయని ఆయుష్ శాఖ వెల్లడించింది. అనారోగ్యానికి గురైనవారికి సమీపంలోకి వెళ్లకుండా ఉండటమే మంచిదని అభిప్రాయపడింది. బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్నప్పుడు ముఖానికి మాస్క్‌లు ధరించాలని సూచించింది. 
 
కరోనా వైరస్ సోకినట్లు అనుమానముంటే.. వెంటనే మాస్క్ ధరించి సమీపంలోని అస్పత్రికి వెళ్లాలని పేర్కొంది. వ్యక్తి గత పరిశుభ్రత ముఖ్యమని పేర్కొంది. తరచుగా చేతులను సబ్బుతో కడుక్కుంటుండాలని సూచించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమాచారం రాగానే పదవులను వదులుకుంటాం: మంత్రి మోపిదేవి