Webdunia - Bharat's app for daily news and videos

Install App

భీష్మ ఓవర్సీస్‌లో అప్పుడే అంత కలెక్ట్ చేసిందా?

Webdunia
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (20:45 IST)
యువ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన భీష్మ సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్స్‌లో అదరగొట్టేసిందనే విషయం తెలిసిందే. ఇక రెండో రోజు కూడా కలెక్షన్స్ సూపర్ అనేలా ఉన్నాయి. నితిన్ - రష్మిక జంటకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన సూర్యదేవర నాగవంశీ మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మించారు. 
 
సింపుల్ స్టోరీ లైన్‌తో ఆద్యంతం ఆసక్తిగా ఉండేలా రూపొందిన ఈ సినిమా ఆడియన్స్‌ను బాగా ఎంటర్టైన్ చేస్తుండటంతో అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్‌తో దూసుకెళుతుంది. 
 
ఫస్ట్ డే నైజాంలో రెండు కోట్లు కలెక్ట్ చేసింది. ఒక మీడియం సినిమా ఇలా కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నైజాంలో ఐదున్నర కోట్లకు అమ్మితే.. రెండు రోజుల్లోనే దాదాపు నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది. 
 
మూడవ రోజు ఆదివారంతో నైజాం డిస్ట్రిబ్యూటర్‌కి పెట్టిన పెట్టుబడి వచ్చేసినట్టే. ఇక సోమవారం నుంచి లాభాలే. ఒక్క నైజాంలోనే కాకుండా.. అన్ని ఏరియాల్లో ఇలాగే ఉంది. 
 
ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే... 143 లోకేషన్స్‌లో  ప్రీమియర్ ద్వారా $ 94,744 కలెక్ట్ చేసింది. ఆతర్వాత ఫస్ట్ డే - 144 లోకేషన్స్‌లో ఈ సినిమా $151,697, రెండో రోజు 132 లోకేషన్స్ - $ 253,560 కలెక్ట్ చేసింది. టోటల్‌గా -$ 500,001 కలెక్ట్ చేసింది. అంటే... హాఫ్ మిలియన్ మార్క్ అందుకుని 1 మిలియన్ మార్క్ దిశగా సక్సస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సినిమా మూడు రోజుల్లోనే హాఫ్ మిలియన్ మార్క్‌ను అందుకోవడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments