Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భీష్మ ట్రైలర్ వీడియో.. సూపర్ అంశాన్ని టచ్ చేశాడుగా? (Video)

Advertiesment
భీష్మ ట్రైలర్ వీడియో.. సూపర్ అంశాన్ని టచ్ చేశాడుగా? (Video)
, మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (15:01 IST)
Bheeshma Trailer
భీష్మ ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. రొమాంటిక్ టచ్, ఫన్‌ వుంటుందనుకుంటే భీష్మ ట్రైలర్ మొత్తం మార్చేసింది. పంటలపై కెమికల్స్ ప్రభావం, అసహజమైన వంగడాల గురించి ఒక బలమైన విషయాన్ని జోడించినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. వ్యవసాయం నేపథ్యంలో సినిమాలు వచ్చాయి కానీ ఈ ఎలిమెంట్ని మాత్రం స్పృశించలేదు. ప్రస్తుతం విభిన్న అంశాన్ని భీష్మ టచ్ చేశాడు. 
 
ఇకపోతే, భీష్మ ఈ నెల 21వ తేదీన మహా శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ట్రైలర్‌లో బలవంతుడితో గెలవొచ్చు, అదృష్టవంతుడితో గెలవలేవు అంటూ విలన్ హీరోకి వార్నింగ్ ఇస్తాడు. 
 
మరి అదృష్టవంతుడితో నితిన్ ఎలా గెలిచాడనే విషయాన్ని తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యేంత వరకు ఆగాల్సిందే. అంతేకాకుండా ప్రస్తుతం విడుదలైన భీష్మ ట్రైలర్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పటికే 3 మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. ఇంకేముంది...? భీష్మ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#HappyBirthdayAnupama ''ప్రేమమ్''తో పాపులర్.. దర్శకురాలిగా అనుపమ