కోలీవుడ్‌లో సింగం హీరోతో రష్మిక మందన రొమాన్స్ (Video)

సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (10:54 IST)
గీత గోవిందం హీరోయిన్ కోలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. అదీ కోలీవుడ్ స్టార్ హీరో నటించబోతుంది.  తమిళ్‌లో సూర్య సరసన రష్మిక నటించనుంది. ఈ సినిమాకు హరి దర్శకత్వం వహించనున్నాడు. మరోవైపు రష్మిక ప్రస్తుతం సూర్య సోదరుడు కార్తి హీరోగా తెరకెక్కుతున్న ‘సుల్తాన్‌’ చిత్రంలో నటిస్తోంది. రష్మిక గీత గోవిందం సినిమాతో తెలుగువారికి మరింత చేరువైంది. 
 
ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో నటించింది. ఆ తర్వాత రష్మిక, మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించి సూపర్ హిట్ అందుకుంది. 
 
తెలుగులో ప్రస్తుతం నితిన్‌తో భీష్మలో నటిస్తోంది. ఇందులో తనలోని టాలెంట్ మొత్తాన్ని బయటపెట్టింది. డ్యాన్స్, గ్లామర్ ఇలా అన్ని రంగాల్లో అద్భుతంగా నటించి మెప్పించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం డాక్టరమ్మాయితో యంగ్ హీరో నిశ్చితార్థం - ఫోటోలు వైరల్