Webdunia - Bharat's app for daily news and videos

Install App

'లవ్‌ స్టోరీ'తో చైతూకి, ఫిదా భామకు హ్యాట్రిక్ ఖాయమా?

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (16:51 IST)
అక్కినేని నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటిస్తున్న ''లవ్‌ స్టోరీ'' త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. చైతన్య మజిలీ, వెంకీమామ చిత్రాల తర్వాత చేస్తున్న సినిమా కావడం.. ఇందులో ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటిస్తుండడం.. శేఖర్ కమ్ముల దర్శకుడు కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 
 
ప్రస్తుతం ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న లవ్‌స్టోరీ కంప్లీట్ అయ్యింది. పాచ్ వర్క్ మాత్రం మిగిలివుంది. దీంతో లవ్ స్టోరీ రిలీజ్ ఎప్పుడు అని అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ సినిమా నిర్మాతలు ప్రకటించలేదు కానీ... లవ్ స్టోరీని డిసెంబర్ నెలాఖరున లేదా జనవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
పాచ్ వర్క్ కూడా కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది అఫిషియల్‍గా ఎనౌన్స్ చేస్తారని సమాచారం. ఈ మూవీ తర్వాత చైతన్య మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తో థ్యాంక్యూ అనే సినిమా చేయనున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. మరి.. మజిలీ, వెంకీమామ చిత్రాలతో వరుస విజయాలు సాధించిన చైతు లవ్ స్టోరీతో హ్యాట్రిక్ సాధిస్తాడో లేదో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నర్సరీ పిల్లాడికి రూ. 2,51,000 ఫీజు, పాసైతే ఐఐటీ వచ్చినట్లేనట, హైదరాబాదులో అంతే...

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

నర్సంపేటలో హైటెక్ వ్యభిచార రాకెట్‌‌.. నలుగురి అరెస్ట్.. ఇద్దరు మహిళలు సేఫ్

వేసవి వేడి నుండి ఉపశమనం- నెల్లూరులో ఏసీ బస్సు షెల్టర్లు

బెంగుళూరు కుర్రోడికి తిక్కకుదిర్చిన పోలీసులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments