Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రానా-సాయి పల్లవిల విరాటపర్వం.. ఓటీటీలో కాదు.. థియేటర్లలోనే..?

Advertiesment
రానా-సాయి పల్లవిల విరాటపర్వం.. ఓటీటీలో కాదు.. థియేటర్లలోనే..?
, బుధవారం, 23 సెప్టెంబరు 2020 (14:29 IST)
Virataparvam
రానా-సాయి పల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. లాక్ డౌన్‌కు ముందు ఈ సినిమాకు సంబంధించిన సగభాగం షూటింగ్ పూర్తయింది. లాక్‌డౌన్‌తో షూటింగ్‌కు బ్రేక్ పడింది. త్వరలోనే మళ్లీ షూటింగ్ రీస్టార్ట్ చేసేందుకు రెడీ అవుతోంది రానా అండ్ విరాట పర్వం టీమ్. 
 
కరోనా మహమ్మారి నేపథ్యంలో థియేటర్లు మూత పడటంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే నిర్మాతలు ఈ మూవీని ఓటీటీలో కాకుండా థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. 
 
సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో నటిస్తోంది. 1980 బ్యాక్ డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రంలో ప్రియమణి కామ్రేడ్ భారతక్క రోల్‌లో కనిపించనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''బ్లాక్ రోజ్'' ఫస్ట్ లుక్.. ఊర్వశీ రౌతేల గ్లామర్ అదుర్స్