Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాటల పల్లకిలో మహేష్ బాబు సర్కారు వారి పాట

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (19:00 IST)
సూపర్ స్టార్ మహేష్‌ బాబు - గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత చాలా కథలు విని ఆఖరికి మహేష్ గీత గోవిందం డైరెక్టర్‌కి ఓకే చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
 
అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా ఆగింది కానీ.. లేకపోతే ఈపాటికే సర్కారు వారి పాట సెట్స్‌కి వెళ్లేది. తాజా వార్త ఏంటంటే... డైరెక్టర్ పరశురామ్ ప్రస్తుతం అమెరికాలో లోకేషన్స్ సెర్చ్ చేస్తున్నారని తెలిసింది. నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. 
 
ఈ భారీ క్రేజీ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ రెండు పాటలు రికార్డింగ్ పూర్తయ్యిందని, ఈ పాటలు మహేష్‌ బాబుకి చాలా బాగా నచ్చాయని తెలిసింది. అల.. వైకుంఠపురములో పాటలు అంత పెద్ద హిట్ అయ్యాయి అంటే కారణం తమన్. అందుకనే మహేష్‌ బాబు ఈసారి తమన్‌కి ఛాన్స్ ఇచ్చాడు.
 
తమన్ రెట్టించిన ఉత్సాహంతో వర్క్ చేస్తున్నాడు. మహేష్ బాబు అభిమానులను దృష్టిలో పెట్టుకుని మరింత కేర్ తీసుకుని తమన్ ఈ పాటలు రెడీ చేస్తున్నాడట. అల.. వైకుంఠపురములో పాటలతో సంచలనం సృష్టించిన తమన్ సర్కారు వారి పాటతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments