ఎటూ తేల్చుకోలేకపోతున్న మహేష్, ఇంతకీ ఏమైంది..?

Webdunia
సోమవారం, 23 మార్చి 2020 (17:05 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేయాలనుకున్నారు. వీరిద్దరూ కలిసి మహర్షి సినిమా చేసారు. ఆ సినిమా సంచలన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేయడంతో పాటు మంచి పేరు తీసుకువచ్చింది. దీంతో మహేష్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్లో మూవీ త్వరలో సెట్స్ పైకి వెళుతుంది అనుకుంటుంటే.. మహేష్ వంశీకి నో చెప్పడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
 
ఆ తర్వాత డైరెక్టర్ పరశురామ్‌ని మహేష్ పిలిచి కథ చెప్పమనడం.. పరశురామ్ చెప్పిన స్టోరీ నచ్చి ఫుల్ స్టోరీ రెడీ చేయమని చెప్పడం జరిగింది. పరశురామ్‌ని పిలిచి కథ చెప్పమనడానికి కారణం.. ఏంటంటే.. గతంలో మహేష్‌ బాబుతో సినిమా చేయడం కోసం పరశురామ్ ఓ కథ చెప్పారు. కథ నచ్చింది కానీ.. అప్పుడు ఆల్రెడీ వేరే సినిమాలు చేయడానికి ఓకే చెప్పడంతో కుదరలేదు. ప్రస్తుతం పరశురామ్ ఫుల్ స్టోరీ రెడీ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు.
 
ఇదిలా ఉంటే... పరశురామ్ తర్వాత కొంతమంది దర్శకులు కథలు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా భీష్మ సినిమాతో సక్సస్ సాధించిన యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల. నితిన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ వసూలు చేసి నితిన్ కెరీర్లో బిగ్ హిట్ అందించింది. దీంతో వెంకీ కుడుములతో సినిమా చేసేందుకు యంగ్ హీరోలే కాకుండా స్టార్ హీరోలు సైతం ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల మహేష్‌ బాబుకి వెంకీ కుడుముల కథ చెప్పడం జరిగింది.

వెంకీ చెప్పిన కథ మహేష్ బాబుకి బాగా నచ్చిందని.. వెంటనే ఫుల్ స్టోరీ రెడీ చేయమని చెప్పారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే... ఇప్పుడు మహేష్, పరశురామ్, వెంకీ కుడుముల ఈ ఇద్దరిలో ఎవరితో సినిమా చేయాలనే ఆలోచనలో పడ్డారని తెలిసింది. ఎందుకంటే.. ఈ రెండు కథలు మహేష్‌కి బాగా నచ్చాయి. అందుకనే ముందుగా ఎవరితో సినిమా చేయాలని ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. 
 
ఈ ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ ప్రస్తుతం ఫుల్ స్టోరీ రెడీ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే.. ఎవరు ముందుగా ఫుల్ స్టోరీ రెడీ చేస్తారో..? ఎవరు ఫుల్ స్టోరీతో మెప్పిస్తారో..? వాళ్లతోనే ముందుగా సినిమా స్టార్ట్ కానుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments