Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాపం.. మహేష్‌ బాబుకి సరైన డైరెక్టర్స్ దొరకడం లేదా..!

Advertiesment
Mahesh Babu
, బుధవారం, 18 మార్చి 2020 (16:50 IST)
సూపర్ స్టార్ మహేష్‌ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేయాలనుకున్నారు కానీ.. కథ నచ్చకపోవడం వలన ఈ సినిమా క్యాన్సిల్ అయ్యింది. పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో మహేష్‌ ఓకే చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మహేష్‌ - పరశురామ్ కాంబినేషన్లో మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. త్వరలో అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయనున్నారు.
 
జూన్ లేదా జులైలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. వంశీ పైడిపల్లి స్టోరీ బాగోలేకపోవడంతో ఎవరితో సినిమా చేయాలనేది మహేష్ బాబుకి సమాధానం లేని ప్రశ్నగా తయారైంది. దీంతో ఇక నుంచి ఇలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశ్యంతో వరుసగా యంగ్ డైరెక్టర్స్ చెప్పే స్టోరీలు వింటున్నాడని సమాచారం. ఇటీవల ప్రవీణ్ సత్తారు, ఇంద్రగంటి మోహనకృష్ణ కథలు చెప్పారని వార్తలు వచ్చాయి. 
 
తాజాగా ఛలో, భీష్మ చిత్రాలతో వరుసగా విజయం సాధించిన వెంకీ కుడుముల మహేష్ బాబుకి కథ చెప్పాడని తెలిసింది. వెంకీ కుడుముల చెప్పిన స్టోరీ లైన్ మరియు అతను కథ చెప్పే విధానం నచ్చడంతో ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయమని చెప్పాడని టాక్. వెంకీ కుడుముల తెరకెక్కించిన ఛలో, భీష్మ ఈ రెండు సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ బాగుంది. కామెడీని బాగా డీల్ చేసాడనే పేరు తెచ్చుకున్నాడు. 
 
రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి భీష్మ సినిమాని చూసి.. చాలా బాగుంది అంటూ డైరెక్టర్ వెంకీ కుడుమలను ఎంతగానో అభినందించారు. భీష్మ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌‌తో వెంకీ కుడుముల సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి కానీ.. చరణ్ తదుపరి చిత్రం ఏంటి అనేది ఇంకా అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయలేదు.
 
మహేష్‌ బాబు లైన్ నచ్చి ఫుల్ స్టోరీ రెడీ చేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే... లైన్‌తో మెప్పించిన వెంకీ.. ఫుల్ స్టోరీతో మెప్పిస్తాడా..? లేదా..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. వెంకీ కుడుముల ఫుల స్టోరీతో మెప్పిస్తాడా..? మహేష్ బాబుని డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకుంటాడా..? లేదా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజమౌళికి షాక్.. ఆర్ఆర్ఆర్ నుంచి అలియా భట్ ఔట్?