సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి నాన్ బాహుబలి రికార్డు సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేయాలనుకున్నారు కానీ.. కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది.
ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో బ్లాక్‌బస్టర్ సాధించిన పరశురామ్ మహేష్ బాబుకి కథ చెప్పడం.. కథ నచ్చి మహేష్ ఓకే చెప్పారని వార్తలు వచ్చాయి. అయితే... ఆ తర్వాత పరశురామ్‌కి కూడా ఓకే చెప్పలేదని.. అందుకనే వేరే దర్శకుడు చెప్పే కథలు వింటున్నారని టాలీవుడ్లో టాక్ వినిపించింది. దీంతో మహేష్ నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది.
గరుడవేగ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు, వి డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా మహేష్ బాబుకి కథ చెప్పారని.. వీరితో పాటు ఓ కొత్త దర్శకుడు కూడా కథ చెప్పారని టాక్ రావడంతో నెక్ట్స్ మూవీని మహేష్ ఎవరితో చేయనున్నాడు అనేది రోజురోజుకు ఆసక్తిని పెంచింది. వంశీ పైడిపల్లి మహేష్ కోసం మరో కథను రెడీ చేస్తున్నారు. పరశురామ్ ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నారు. దీంతో ఈ ఇద్దరిలో మహేష్ ఎవరి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని సస్పెన్స్ గా ఉండేది కానీ.. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. పరశురామ్ తోనే మహేష్ నెక్ట్స్ మూవీ అని.. వార్తలు వస్తున్నాయి.
పరశురామ్ తో సినిమా చేయడానికి మహేష్ ఓకే చెప్పినా.. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా చేయడానికి ఓ వైపు మైత్రీ మూవీ మేకర్స్, మరో వైపు 14 రీల్స్ ప్లస్ ఈ రెండు సంస్థలు పోటీపడుతున్నాయి. దీంతో ఏ బ్యానర్లో ఈ భారీ క్రేజీ మూవీ ఉంటుంది అనేది సస్పెన్స్ ఉండేది. ఇప్పుడు ఈ విషయంలో కూడా క్లారిటీ వచ్చేసిందని తెలిసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. మహేష్ - పరశురామ్ కాంబినేషన్లో మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుందని తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాని త్వరలో అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయనున్నారని టాక్.
ఉగాది సందర్భంగా ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో ప్రారంభించి జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరు అనేది ఫైనల్ చేస్తున్నారు. మహేష్ బాబుతో సినిమా చేయడం అనేది పరశురామ్ డ్రీమ్. తన కల ఇప్పుడు నెరవేరుతుండడంతో చాలా హ్యాపీగా ఫీలవుతూ.. ఈ సినిమాని తన కెరీర్ లోను, మహేష్ కెరీర్ లోను మరచిపోలేని సినిమాగా నిలిచేలా తెరకెక్కిస్తానని చెబుతున్నారు. మరి.. త్వరలోనే ఈ మూవీని అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.