Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రజనీకాంత్‌ను ఫాలో అవుతున్న మహేష్ బాబు, ఏ విషయంలో?

Advertiesment
రజనీకాంత్‌ను ఫాలో అవుతున్న మహేష్ బాబు, ఏ విషయంలో?
, బుధవారం, 11 మార్చి 2020 (21:21 IST)
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుసగా సినిమాలు చేస్తూ... యంగ్ స్టార్స్‌కి గట్టి పోటీ ఇస్తున్నారు. ఈమధ్య ఇంకాస్త స్పీడు పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా యంగ్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేయడానికి రజనీకాంత్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అయితే... రజనీకాంత్‌కు దైవభక్తి ఎక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే. అందుకనే ప్రతి సంవత్సరం ఆయన హిమాలయాలకు వెళుతుంటారు. దేవుడు గురించి ఆయనకు ఉన్న సందేహాలను అక్కడ ఉన్న స్వామిజీలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. 
 
ఇలా ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా హిమాలయాలకు వెళుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే... మహేష్ బాబు ఉంటే సెట్లో ఉంటారు లేదంటే ఇంట్లో ఉంటారు. సెట్ లోను, ఇంట్లోను లేరంటే.. విదేశాలకు వెళ్లినట్టే. ఆయనకు ఏమాత్రం సమయం దొరికినా... ఫ్యామిలీతో స్పెండ్ చేస్తుంటారు. ఫారిన్ ట్రిప్ వేసేస్తుంటారు. తన ప్రతి సినిమా రిలీజ్ తర్వాత ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లడం మహేష్ బాబుకి అలవాటు. 
 
మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడం.. అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో సరికొత్త రికార్డులు సృష్టించడం తెలిసిందే.
 
ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లడం.. ఆ తర్వాత హైదరాబాద్ రావడం కూడా జరిగింది. ఈ సమ్మర్లో వంశీ పైడిపల్లితో చేయనున్న సినిమాని స్టార్ట్ చేయాలి అనుకున్నారు. దిల్ రాజు ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన నిర్మించాలి అనుకున్నారు కానీ.. వంశీ పైడిపల్లి చెప్పిన స్టోరీ మహేష్ బాబుకి పూర్తిగా సంతృప్తి కలిగించకపోవడంతో ఈ ప్రాజెక్టికి నో చెప్పాడు. గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన పరశురామ్ గతంలో ఓ స్టోరీ లైన్ వినిపించాడు. ఇప్పుడు ఆ స్టోరీని ఫుల్ స్టోరీగా రెడీ చేసి డైలాగ్ వెర్షెన్‌తో సహా రమ్మని పరశురామ్‌కి మహేష్ చెప్పారు.
 
మహేష్ పిలిచి ఇలా ఆఫర్ ఇవ్వడంతో.. వెంటనే పరశురామ్ రంగంలోకి దిగి ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారు. ఈ విధంగా తదుపరి చిత్రం కథ ఇంకా రెడీ కాకపోవడంతో.. కొంత టైమ్ దొరికింది. అంతే.. ఈసారి హిమాలయాలకు వెళదాం అని ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి మహేష్ హిమాలయాల ట్రిప్ ప్లాన్ చేసినట్టు సమాచారం. అక్కడ నుంచి వచ్చిన తర్వాత తదుపరి చిత్రం ఎవరితో చేయనున్నాడు అనేది ఫైనల్ చేస్తాడని టాక్ వినిపిస్తోంది. ఓ వైపు పరశురామ్ ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేస్తుంటే... మరోవైపు వంశీ పైడిపల్లి మహేష్ కోసం మరో స్టోరీ రెడీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లవ్ స్టోరీని డిఫరెంట్‌గా ప్రమోట్ చేస్తున్న చైతన్య..!