Webdunia - Bharat's app for daily news and videos

Install App

'స‌వ్య‌సాచి'కి మాధ‌వ‌న్ కండీష‌న్ పెట్టారా..?

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (15:08 IST)
అక్కినేని నాగ చైత‌న్య హీరోగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన తాజా చిత్రం స‌వ్య‌సాచి. ఈ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించింది. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రంలో మాధ‌వ‌న్ విల‌న్‌గా న‌టించారు. త‌మిళ విభిన్న క‌థా చిత్రాల్లో న‌టించే మాధ‌వ‌న్‌కు తెలుగులో ఇదే ఫ‌స్ట్ స్ట్రెయిట్ మూవీ కావ‌డం విశేషం. ఇదిలావుంటే... మాధ‌వ‌న్ స‌వ్య‌సాచిలో న‌టించేందుకు ఓ కండిషన్ పెట్టార‌ట‌.
 
ఆ కండీష‌న్‌కి ఓకే అంటేనే స‌వ్య‌సాచిలో న‌టిస్తాన‌ని చెప్పార‌ట‌. ఇంత‌కీ ఆ కండీష‌న్ ఏంటంటే... సవ్యసాచి చిత్రాన్ని తమిళంలో విడుదల చేయకూడదు అని. అందుకు దర్శకుడు చందు మొండేటి, నిర్మాతలు సరే అన‌డంతో మాధ‌వ‌న్ సినిమా చేశారట‌. అందుచేత‌నే ఈ సినిమాను తమిళంలో డబ్బింగ్‌ చేయలేదు అని తెలిసింది. 
 
సాధారణంగా పరభాషా నటీనటులు తెలుగు సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తే… ఆ భాషలో డబ్బింగ్‌ చేసి విడుదల చేయడం ద్వారా నిర్మాతలకు కొంత లాభం వస్తుంది. కానీ ఇచ్చిన మాట ప్ర‌కారం అలా చేయ‌లేద‌ట‌. అస‌లు మాధ‌వ‌న్ ఎందుకు అలా కండీష‌న్ పెట్టారంటే... ఈ చిత్రం తమిళంలో విడుదల చేస్తే, తను హీరోగా చేసే సినిమాలపై, కెరీర్‌పై ఎఫెక్ట్‌ పడుతుందని మాధవన్ ఈ కండీష‌న్ పెట్టార‌ట‌. అదీ సంగ‌తి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments