'మహానటి'కి మరో గోల్డెన్ ఛాన్స్? విజయ నిర్మల పాత్రలో...

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (13:50 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో తన అద్భుత నటనతో "మహానటి"గా గుర్తింపు పొందిన హీరోయిన్ కీర్తి సురేష్. ఈమె అలనాటి నటి సావిత్రి పాత్రను పోషించి, ఆ పాత్రలో జీవించింది. 'మహానటి' పేరుతో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్. అలాగే, ఈ చిత్రంలో కీర్తి సురేష్ పోషించిన సావిత్రి పాత్రకు గాను ఎన్నో అవార్డులు వచ్చాయి. 
 
తాజాగా కీర్తి గురించి మరో వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఆమెకు మరో బయోపిక్‌లో నటించే అవకాశం వచ్చిందనేదే ఆ వార్త. ప్రముఖ నటి, సూపర్ స్టార్ కృష్ణ అర్థాంగి, దివంగత విజయనిర్మల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో నటించే అవకాశం కీర్తి సురేష్‌కు వరించందట. తన తల్లి బయోపిక్ మూవీలో నటించాల్సిందిగా కీర్తి సురేష్‌ను ఆమె తనయుడు, నటుడు నరేష్ కోరినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
తెలుగు సినీ పరిశ్రమలో విజయనిర్మలది ఒక ప్రత్యేకమైన ప్రస్థానం. హీరోయిన్, దర్శకురాలు, నిర్మాతగా ఆమె తనదైన ముద్ర వేశారు. ఆమె బయోపిక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని... ఆమె పాత్రకు కీర్తి అయితేనే పూర్తి న్యాయం చేస్తుందనే నమ్మకంతో ఉన్నారట. అయితే, 'మహానటి' తర్వాత మరో బయోపిక్ చేయనని కీర్తి సురేశ్ ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో, కీర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

సింహాచలంలో విరాట్ కోహ్లీ సందడి.. సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు

పెళ్లికి ముందు ప్రియుడితో గోవా హోటల్‌లో యువతి ఎంజాయ్.. ఇపుడు వీడియోలతో బ్లాక్‌మెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments