'మహానటి'కి కళ్యాణం... క్లారిటీ ఇవ్వని కీర్తి సురేశ్

శనివారం, 4 ఏప్రియల్ 2020 (12:43 IST)
నేటి తరం 'మహానటి'గా ప్రతి ఒక్కరూ పిలుచుకునే పేరు కీర్తి సురేష్. అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' చిత్రంలో ప్రధాన భూమికను పోషించింది. ఈ చిత్రం ద్వారా తనలోని నటనను సినీలోకానికి చాటిచెప్పింది. ఆ తర్వాత ఆమెను మహానటి అంటూ పిలువసాగారు. 
 
ఈ క్రమంలో కీర్తి సురేశ్ త్వరలోనే ఓ ఇంటికి కోడలు కాబోతుందట. పెద్దల సమస్మతితో వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకుందట. ఆమె ఓ వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన యువకుడితో ప్రేమలోపడిందట. ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లగా వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ఈ వార్తలపై కీర్తి ఓ క్లారిటీ ఇవ్వాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 'బుట్టబొమ్మ' మాయలో నెటిజన్లు.. సోషల్ మీడియా షేక్