Webdunia - Bharat's app for daily news and videos

Install App

''శ్రీదేవి''గా రకుల్ ప్రీత్ సింగ్.. బయోపిక్‌లోనా?

అతిలోకసుందరి, అందాల రాశి శ్రీదేవి బయోపిక్ తెరకెక్కనుందని ప్రచారం సాగుతోంది. అయితే ఆమె బయోపిక్‌ తీసేది లేదని.. డాక్యుమెంటరీ తరహాలో శ్రీదేవి సినిమా రూపొందించాలని ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్ ప్లాన్ చేస్

Webdunia
బుధవారం, 18 జులై 2018 (17:48 IST)
అతిలోకసుందరి, అందాల రాశి శ్రీదేవి బయోపిక్ తెరకెక్కనుందని ప్రచారం సాగుతోంది. అయితే ఆమె బయోపిక్‌ తీసేది లేదని.. డాక్యుమెంటరీ తరహాలో శ్రీదేవి సినిమా రూపొందించాలని ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. 


అయితే శ్రీదేవి బయోపిక్‌లో రకుల్ నటించట్లేదని.. ప్రతిష్టాత్మకంగా క్రిష్ రూపొందిస్తున్న ''ఎన్టీఆర్'' బయోపిక్‌లో రకుల్ ప్రీత్ సింగ్ శ్రీదేవిగా కనిపించనుందట. 
 
ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తుండగా, బసవతారకం పాత్రను విద్యాబాలన్ చేస్తోంది. ప్రకాశ్ రాజ్, రానా, సీనియర్ నరేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా కోసం రకుల్ ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేశారని తెలిసింది. అయితే ఆమె ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపిస్తుందని టాక్. కానీ రకుల్ స్పెషల్ సాంగ్ కోసం ఎంపిక కాలేదని, సీనియర్ హీరోయిన్ ''శ్రీదేవి'' పాత్ర కోసం ఆమెను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. 
 
కాగా ఎన్టీఆర్, శ్రీదేవి కలిసి చాలా సినిమాల్లో నటించారు. వాటిలో ఎన్నో సూపర్ హిట్స్ వున్నాయి. అందువలన ఈ సినిమాలో శ్రీదేవి పాత్ర కోసం రకుల్‌ను సంప్రదించడం.. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయిందట. ఇక ''ఎన్టీఆర్''లో మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments