Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యాబాలన్‌ను ఆత్మీయంగా స్వాగతించిన ఎన్.టి.ఆర్ కుటుంబం (ఫోటోలు)

బాలీవుడ్ నటీమణి విద్యాబాలన్ నేడు ఎన్.టి.ఆర్ కుటుంబాన్ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్.టి.ఆర్ పెద్ద కుమార్తె లోకేశ్వరి పూల బొకేతో విద్యాబాలన్‌కు స్వాగతం తెలిపారు. అలాగే నందమూరి వంశం రివాజు ప్రకారం ఆమెకు చీరను బహుకరించారు.

Webdunia
బుధవారం, 18 జులై 2018 (16:20 IST)
బాలీవుడ్ నటీమణి విద్యాబాలన్ నేడు ఎన్.టి.ఆర్ కుటుంబాన్ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్.టి.ఆర్ పెద్ద కుమార్తె లోకేశ్వరి పూల బొకేతో విద్యాబాలన్‌కు స్వాగతం తెలిపారు. అలాగే నందమూరి వంశం రివాజు ప్రకారం ఆమెకు చీరను బహుకరించారు.
 
ఎన్.టి.ఆర్ బయోపిక్‌లో ఆయన సతీమణి బసవతారకం పాత్ర పోషించనున్న విద్యాబాలన్ ఎన్.టి.ఆర్ కుటుంబ సభ్యుల నుంచి ఆమె పాత్రకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు.. లోకేశ్వరిని అడిగి బసవతారకం వ్యవహారశైలి ఎలా ఉంటుంది, ఆమెకు ఇష్టమైన విషయాలేమిటి, హాబీస్ ఏమిటి అనేవి అడిగి తెలుసుకున్నారు. ఈ ఆత్మీయ పరిచయ తేనీటి విందులో నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరా దేవి, ఆయన చిన్నకుమార్తె తేజస్విని మరియు ఆయన చిన్న అల్లుడు శ్రీభరత్ పాలుపంచుకున్నారు.
 
నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన విద్యాబాలన్ బుధవారం నుంచి ఎన్.టి.ఆర్ సెట్స్‌లో పాల్గొననున్నారు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన స్పెషల్ సెట్లో షూటింగ్ జరుగుతోంది. విద్యాబాలన్ ఓ వైవిధ్యమైన గెటప్‌లో కనిపించనున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా.. నందమూరి బాలకృష్ణ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని సాయికొర్రపాటి, విష్ణు ఇందూరు సమర్పిస్తున్నారు. 
 
నటీనటులు : నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, నరేష్ వి.కె, మురళీశర్మ, ప్రకాష్ రాజ్ తదితరులు.. సాంకేతిక బృందం: దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి నిర్మాతలు: నందమూరి బాలకృష్ణ, విష్ణువర్ధన్ ఇందూరి, సాయి కొర్రపాటి-ఎం.ఆర్.వి.ప్రసాద్; బ్యానర్లు: ఎన్.బి.కె ఫిలిమ్స్-విబ్రా మీడియా-వారాహి చలనచిత్రం; సంగీతం: ఎం.ఎం. కీరవాణి; సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ వి.ఎస్; మాటలు: సాయిమాధవ్ బుర్రా; పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి; ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్; పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త గల్లా పట్టుకుని లాగికొట్టిన బాక్సర్ స్వీటీ బూరా (Video)

Two sisters: ఫుడ్ పాయిజనింగ్.. ఇధ్దరు సిస్టర్స్ మృతి.. తండ్రి, కుమార్తె పరిస్థితి విషమం

ఛత్రపతి శివాజీపై నాగ్‌పూర్ జర్నలిస్ట్ అనుచిత వ్యాఖ్యలు - అరెస్టు

పూజ పేరుతో నయవంచన... ప్రశ్నించినందుకు సామూహిక అత్యాచారం!!

అమెరికాలో గుడివాడ యువకుడు ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments