Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాన్వి పుట్టినరోజు... ఇవాళ శ్రీదేవిని పూర్తిగా మర్చిపోయి ఎంజాయ్ చేయాలట...

ఇవాళ శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్ పుట్టినరోజు. ఆమె 21వ ఏటలోకి ప్రవేశిస్తుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సోనమ్ కపూర్ అయితే జాన్వి చాలా దృఢమైన యువతి అంటూ కితాబిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. తన తల్లి శ్రీదేవ

Advertiesment
జాన్వి పుట్టినరోజు... ఇవాళ శ్రీదేవిని పూర్తిగా మర్చిపోయి ఎంజాయ్ చేయాలట...
, మంగళవారం, 6 మార్చి 2018 (13:47 IST)
ఇవాళ శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్ పుట్టినరోజు. ఆమె 21వ ఏటలోకి ప్రవేశిస్తుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సోనమ్ కపూర్ అయితే జాన్వి చాలా దృఢమైన యువతి అంటూ కితాబిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. తన తల్లి శ్రీదేవిని కోల్పోయినప్పటికీ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతోందంటూ ప్రశంసలు కురిపించింది. మరోవైపు బోనీ కపూర్ మొదటి భార్య కుమార్తె అన్షూలా కూడా జాన్వి కపూర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.
 
ఇదిలావుంటే ఈరోజు సాయంత్రం జాన్వి కపూర్ తండ్రి బోనీ కపూర్ కుటుంబ సభ్యుల మధ్య కుమార్తె జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నారట. ఈ వేడుక శ్రీదేవికి సంబంధించిన విషయాలను పూర్తిగా మర్చిపోయి కేవలం జాన్వి కపూర్ ఆనందంగా వుండేవిధంగా చూడాలని కోరుకుంటున్నారట. మరి బోనీ కపూర్ కోరుకున్నట్లుగా జాన్వి కపూర్ పుట్టినరోజు వేడుకలు జరుగుతాయా లేక శ్రీదేవి జ్ఞాపకాలతోనే అంతా నడుస్తుందా చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నీరు పెట్టిస్తున్న ఇర్ఫాన్ ఖాన్ ట్వీట్... రేర్ డిసీజ్‌తో బాధపడుతున్నానంటూ....