Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మానాన్నల బంధాన్ని అపహాస్యం చేయొద్దు.. ప్లీజ్ : జాన్వీ

మా అమ్మానాన్నల బంధాన్ని అపహాస్యం చేయొద్దంటూ దివంగత నటి శ్రీదేవి - బోనీ కపూర్‌ దంపతుల పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ మీడియాకు విజ్ఞప్తి చేశారు. గత నెల 24వ తేదీన దుబాయ్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లో ప్రమాదవశాత్త

అమ్మానాన్నల బంధాన్ని అపహాస్యం చేయొద్దు.. ప్లీజ్ : జాన్వీ
, ఆదివారం, 4 మార్చి 2018 (12:34 IST)
మా అమ్మానాన్నల బంధాన్ని అపహాస్యం చేయొద్దంటూ దివంగత నటి శ్రీదేవి - బోనీ కపూర్‌ దంపతుల పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ మీడియాకు విజ్ఞప్తి చేశారు. గత నెల 24వ తేదీన దుబాయ్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లో ప్రమాదవశాత్తూ శ్రీదేవి స్నానపుతొట్టిలో పడి కన్నుమూసిన విషయం తెల్సిందే. ఈ మృతి వెనుక ఏదో అనుమానం ఉందనే కథనాలు ప్రసారమయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో తమ తల్లిదండ్రుల బంధంపై జాన్వీ కపూర్ ఓ లేఖ రాసింది. తన తల్లిదండ్రులు శ్రీదేవి, బోనీ కపూర్‌లు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, వారి మధ్య ఉన్న బంధాన్ని అపహాస్యం చేయవద్దంటూ విజ్ఞప్తి చేశారు. 
 
ప్రతి ఒక్కరూ వారి వారి తల్లిదండ్రులను ప్రేమించాలని, తన తల్లి ఆత్మ శాంతి కోసం ప్రార్థించాలని, అదే తనకు అభిమానులిచ్చే పుట్టిన రోజు బహుమానమన్నారు. తన తల్లిదండ్రులు ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న అనోన్యమైన జంటని, వారు ప్రేమించుకున్నారని, వారి ప్రేమను కించపరచవద్దని వేడుకుంది. 
 
ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనే వారి బంధాన్ని గౌరవించాలని కోరింది. తాను, తన చెల్లి ఖుషీలు కేవలం తల్లిని మాత్రమే కోల్పోతే, తమ తండ్రి సర్వస్వాన్నే పోగొట్టుకున్నారని వాపోయింది. తామిద్దరికీ తల్లిగా, తండ్రికి సహచరిగా ఆమె తన పాత్రను సమర్థవంతంగా పోషించిందని జాన్వీ వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజనీ - శంకర్‌లకు షాక్ : 2.O మూవీ టీజర్ లీక్