Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరణ్ జోహార్‌తో కోల్డ్ వారా? ప్రభాస్ అంత అడిగాడా? అసలేం జరుగుతోంది?

డార్లింగ్ ప్రభాస్‌కు బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్‌కు కోల్డ్ వార్ జరుగుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌కు ఏర్పడిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కరణ్ జోహార్ భారీ ప్రాజ

Webdunia
గురువారం, 22 ఫిబ్రవరి 2018 (15:32 IST)
డార్లింగ్ ప్రభాస్‌కు బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్‌కు కోల్డ్ వార్ జరుగుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌కు ఏర్పడిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కరణ్ జోహార్ భారీ ప్రాజెక్టు కోసం డార్లింగ్‌ను సంప్రదించారట. అందుకు ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఈ ప్రాజెక్టు కోసం ప్రభాస్ పారితోషికం భారీగా అడిగారట. 
 
ఒకటి రెండు కాదు.. ఏకంగా రూ.20కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో.. కరణ్ జోహార్ షాక్ అయ్యారట. అంతేకాకుండా ఆ ప్రాజెక్టును పక్కనబెట్టేశారట. దీంతో ప్రభాస్, కరణ్‌ల మధ్య విభేదాలు తలెత్తాయని.. వీరిద్దరి మధ్య కోల్డ్ వారే జరుగుతుందని సమాచారం. ఈ ప్రభావం సాహో సినిమాపై పడిందని సమాచారం. 
 
బాహుబలికి తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సాహో చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు ఉత్తరాది బయ్యర్లు ఆసక్తి చూపట్లేదట. సాహోను భారీ బడ్జెట్‌తోపాటు అత్యంత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నారు. ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసమే దాదాపు రూ.25కోట్లకు పైగా ఖర్చు చేశారు. అలాంటి ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు ఉత్తరాది బయ్యర్స్ వెనక్కి తగ్గడానికి.. కరణ్ జోహార్‌తో ప్రభాస్ జగడమే కారణమని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
 
కరణ్ జోహార్- ప్రభాస్ ప్రాజెక్టు ఆగిపోయిందని వార్తలొస్తున్న నేపథ్యంలో... కరణ్ జోహార్ గతంలో ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ''డియర్ ఆంబిషన్.. నీవేదైనా ఘనత సాధించాలనుకుంటే.. పేరున్న దిగ్గజాలతో పోల్చుకోవడం తగ్గించుకోవాలి'' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రభాస్‌ను ఉద్దేశించినవేనని సినీ జనం అంటున్నారు. మరి ''సాహో'' పరిస్థితి ఏమౌతుందోనని ప్రభాస్ ఫ్యాన్ ఆందోళన చెందుతున్నారు. మరి ఈ వివాదానికి ప్రభాస్ ఎలా ఫుల్ స్టాప్ పెడతారో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments