Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఏడాది కంగనా రనౌత్ పెళ్లి.. డిసెంబరులో నిశ్చితార్థం?

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (10:25 IST)
వివాదాస్పద నటి కంగనా రనౌత్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. కంగనా 2006లో గ్యాంగ్‌స్టర్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. దాని కోసం ఆమె ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. 
 
లైఫ్ ఇన్ ఎ మెట్రో, వో లమ్హే, ఫ్యాషన్‌లో ఆమె భావోద్వేగపరంగా బలమైన పాత్రలను పోషించినందుకు ప్రశంసలు అందుకుంది. ఆమె నటించడమే కాకుండా సోషల్ మీడియాలో కొన్ని వివాదాస్పద అంశాల గురించి తరచుగా మాట్లాడుతుంది. 
 
కాబట్టి ఆమెకు మద్దతుదారులే కాదు.. వ్యతిరేకులు కూడా ఉన్నారు. ఇప్పుడు వార్తల్లో కంగనా రనౌత్ వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి అది వివాదానికి కాదు. కంగనా పెళ్లి చేసుకోబోతోందని, డిసెంబర్‌లో నిశ్చితార్థం జరగనుందని సమాచారం.
 
ఒక వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగిన తర్వాత, వారి వివాహం ఏప్రిల్ 2024లో జరగనుంది. అయితే, అధికారికంగా ఇంకా ప్రకటించకపోవడంతో అభిమానులు గందరగోళంలో ఉన్నారు. ఏది ఏమైనా కంగనా దీనికి సమాధానం చెబుతుంది.
 
కంగనా రనౌత్ తాజాగా చంద్రముఖి 2లో ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఇందులో రాఘవ లారెన్స్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం గురువారం థియేటర్లలో వచ్చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌పై పన్నుల మోత మోగిస్తాం : డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

'బిగ్ బాస్‌'‍ ఛాన్స్ పేరుతో వైద్యుడికి కుచ్చుటోపీ - రూ.10 లక్షలు వసూలు

Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యాక రుణాల తగ్గింపును పరిశీలిస్తాం?

ఉదయం మూడు ముళ్లు వేయించుకుంది.. రాత్రికి ప్రాణాలు తీసుకుంది.... నవ వధువు సూసైడ్

Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే- జర్నీకి రెండు గంటలే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments