Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గూగుల్ 25వ పుట్టిన రోజు.. ఇద్దరు స్నేహితులు సృష్టించారు.. ఇప్పుడు?

Advertiesment
Google
, బుధవారం, 27 సెప్టెంబరు 2023 (19:01 IST)
Google
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్ ఇంజన్ అయిన గూగుల్ సెప్టెంబర్ 27 తన 25వ పుట్టినరోజు జరుపుకుంటోంది. సాధారణంగా సెలబ్రిటీల పుట్టినరోజులను గుర్తుచేసే గూగుల్ ఈరోజు తన పుట్టినరోజును డూడుల్ పెట్టింది. అమెరికా లోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్‌లో పీహెచ్‌డీ విద్యార్థులు వేన్ లారీ పేజ్, సెర్గీ బ్రిన్ అనే ఇద్దరు స్నేహితులు Googleని సృష్టించారు. వారి ప్రాజెక్ట్‌గా వారు ఆన్‌లైన్‌లో సెర్చ్ ఇంజిన్‌ను రూపొందించాలని భావించారు. 
 
ఈ సెర్చ్ ఇంజన్ లైబ్రరీలో పుస్తకాలు, పత్రాల కోసం శోధించడానికి సృష్టించబడింది. నేడు ఇది ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రసిద్ధ గూగుల్‌గా ఎదిగింది. గూగుల్ సెప్టెంబర్ 27, 1998న USAలోని కాలిఫోర్నియాలో ప్రారంభించబడింది. 
 
2004లో, Google ఇమెయిల్ సర్వీస్ Gmail పరిచయం చేయబడింది. ఇప్పటివరకు గూగుల్ 170కి పైగా కంపెనీలను కొనుగోలు చేసింది. డేటా రక్షణ కోసం ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గూగుల్ 9 లక్షల సర్వర్‌లను కలిగి ఉంది.
 
ఇది రోజుకు 100 మిలియన్ల కంటే ఎక్కువ శోధనలను, ప్రపంచవ్యాప్తంగా 150 కంటే ఎక్కువ భాషలలో నిర్వహిస్తుంది. గూగుల్‌లో 53 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్యాధి కంటే చికిత్స కఠినంగా ఉండకూడదు: ఎలన్ మస్క్