Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ 'చందమామ'కు పెళ్లి ఫిక్స్?... వరుడు ఎవరంటే...

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (17:03 IST)
తెలుగు వెండితెరకు చందమామ చిత్రం ద్వారా పరిచయమైన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్‌గా రాణిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి వంటి అగ్రహీరోలతో కలిసి నటించింది. అలాగే, కుర్రకారు హీరోలతోనూ జతకట్టింది. అయితే, ఈ అమ్మడు త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. 
 
ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు ఇప్పటికే నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కాజల్‌ అగర్వాల్‌ ముంబైకి చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌, వ్యాపారవేత్తను‌ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా కాజల్‌ పెళ్లాడబోతోన్న వ్యక్తి పేరు కూడా బయటికి వచ్చేసింది. 
 
ఇంటీరియర్‌ డిజైనర్‌, వ్యాపారవేత్త అయిన గౌతమ్‌ కిచ్లుని కాజల్‌ వివాహం చేసుకోనుందని, ఇప్పటికే అతనితో నిశ్చితార్థం కూడా పూర్తయిందని తాజాగా వార్తలు బయటికి వచ్చాయి. ముంబైలో వీరి వివాహం జరగనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
అయితే ఇంతకుముందు ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఎలా అయితే కామ్‌గా ఉందో.. ఇప్పుడు కూడా కాజల్‌ సైలెంట్‌గానే ఉండటం విశేషం. ప్రస్తుతం స్టార్‌ హీరోలైన కమల్‌ హాసన్‌, చిరంజీవి వంటి వారి సరసన కాజల్ నటిస్తోంది. చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో కాజల్ ప్రధాన హీరోయిన్. అలాగే, దర్శకుడు తేజ కూడా కాజల్‌తో ఓ సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments