Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారప్పకు చెల్లెలుగా సుమ..?

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (17:02 IST)
యాంకర్ సుమకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బుల్లితెరపై మెరిసిన ఈ భామ.. వెండితెరపై మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆమెతో సినిమాలు చేయడానికి కూడా కొంతమంది ప్రయత్నాలు చేసినా అవి పెద్దగా ఫలించలేదు. ఇక ఇప్పుడు యాంకర్‌గా చాలా బిజీగా ఉంటుంది. 
 
అయితే కరోనా వైరస్ కారణంగా ఆమె గత కొన్ని రోజులుగా యాంకర్ షూటింగ్‌లకు వెళ్ళడం లేదు. బుల్లితెరకు ఆమె కాస్త దూరంగా వుండటానికి కరోనా వైరస్ ఒక కారణమైతే.. మరో కారణం కూడా ప్రచారం లోకి వచ్చింది. ఆమె సినిమాల్లో కూడా నటించడానికి ఆసక్తి చూపిస్తుంది అని ప్రచారం జరుగుతోంది. 
 
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలో ఆమె నటించే అవకాశం ఉందని అని అప్పట్లో ప్రచారం జరిగింది. అది ఎంతవరకు నిజం ఏంటి అనేది తెలియక పోయినా ఇప్పుడు మాత్రం ఆమె ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 
 
వెంకటేష్ నటిస్తున్న నారప్ప సినిమాలో ఆమె ఒక కీలక పాత్రలో నటిస్తోంది. అయితే అది ఎక్కువ సేపు ఉండే పాత్ర కాదు. ఆ సినిమాలో ఆమె వెంకటేష్‌కి చెల్లెలుగా నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఆ పాత్రలో సుమ చనిపోతుందని, దీంతో ఆ పాత్ర ముగిసి పోతుందని చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలి కోసం భార్యను చంపిన భర్త... ఆపై దొంగలు చంపేశారంటూ...

జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ క్లౌడ్ బరస్ట్ - ఏడుగురు దుర్మరణం

తెలంగాణాలో భారీ వర్ష సూచన - కంట్రోల్ రూమ్ ఏర్పాటు

రష్యాలో ఘోర అగ్ని ప్రమాదం - 11 మంది సజీవదహనం

అధిక వడ్డీ ఆశ పేరుతో రూ.20 కోట్ల మోసం... వ్యక్తి పరార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments