Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా ప్రియమైన రాజా.. మై లవ్.. నువ్వే నా జీవితం.. యాంకర్ సుమ

Advertiesment
నా ప్రియమైన రాజా.. మై లవ్.. నువ్వే నా జీవితం.. యాంకర్ సుమ
, మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (09:56 IST)
సుమ ఎవరంటే అందరూ యాంకర్ అని టక్కున చెప్పేస్తారు. ప్రస్తుతం ఈమె చేసిన ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దశాబ్ద కాలంగా తెరపై ఎన్నో సినీ కార్యక్రమాలను, ఈవెంట్స్‌ చేస్తూ ప్రేక్షకులను అలరించడంలో ముందుండే సుమ.. తన భర్త రాజీవ్‌ కనకాలతో కలిసి వున్న ఫోటోను నెట్టింట పోస్టు చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
టాలీవుడ్‌లో సుమ, రాజీవ్ కనకాల దంపతులకు మంచి గుర్తింపు వుంది. అయితే ఈ మధ్య కాలంలో సుమ-రాజీవ్‌ వైవాహిక జీవింత గురించి పెద్ద ఎత్తున రూమర్స్‌ వినిపించాయి. వారి వివాహ బంధంలో విభేదాలు వచ్చాయని, ఇద్దరూ వేరువేరుగా ఉంటున్నారని పుకార్లు షికారు చేశాయి. అంతేకాదు రాజీవ్‌ నుంచి సుమ విడాకులు కూడా కోరిందని సోషల్‌ మీడియా కోడైకూసింది. 
 
అయితే ఈ ఊహాగానాలను సుమ చేసిన ఓ ట్వీట్‌ సోషల్‌ మీడియా రాయుళ్ల ఊహాగానాలను పటాపంచల్‌ చేసింది. తమపై వస్తున్న వార్తలకు చెక్‌పెడుతూ.. సుమ తన ట్విటర్‌ ఖాతా ద్వారా రాజీవ్‌పై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఓ సందేశం ఇచ్చింది. 
 
రాజీవ్ కనకాలను ఆప్యాయంగా హత్తుకుని ఎమోషనల్‌గా భావాన్ని చూపించింది. ''నా ప్రియమైన రాజా.. మై లవ్.. ఎప్పటికైనా నువ్వే నా జీవితం, నువ్వే నా ఆనందం'' అంటూ తమ వైవాహిక జీవితం ఎంత బలంగా ఉందో చాటిచెప్పింది. ఈ పోస్టుపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక మనిషి భద్రతకు నెలకు రూ.10 లక్షల ఖర్చు అవసరమా?