Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాచిలర్ లైఫ్‌కు టాటా చెప్పనున్న మెగా ఫ్యామిలీ హీరో!

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (16:09 IST)
మెగా ఫ్యామిలీకి చెందిన హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకరు. లోబడ్జెట్ చిత్రాల హీరోగా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ కుర్ర హీరో బ్యాచిలర్ జీవితానికి స్వస్తి చెప్పనున్నాడు. వచ్చే యేడాది వేసవిలో వివాహం చేసుకుని ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇందుకు మెగాస్టార్ చిరంజీవి కూడా పచ్చజెండా ఊపేశారట. 
 
కాగా, తెలుగు చిత్రపరిశ్రమలో ఇప్పటికే పలువురు కుర్ర హీరోలు పెళ్లి పీటలెక్కారు. అలాంటివారిలో రానా, నితిన్, నిఖిల్‌లు ఉన్నారు. మరికొందరికి పెళ్లిళ్లు ఫిక్స్ అయిపోయాయి. కొణిదెల నిహారికకు యువ పారిశ్రామికవేత్త జొన్నలగడ్డ చైతన్యతో నిశ్చితార్థం జరిగింది. పెళ్లి డేట్ ఖరారు కావాల్సి ఉంది.
 
ఇపుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లికొడుకు కాబోతున్నాడు. ఇంట్లోవాళ్లు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఏపీకి చెందిన బంధువుల అమ్మాయినే పెళ్లాడుతున్నాడని సమాచారం. 
 
సాయి తేజ్ పెళ్లికి ఆయన మేనమామ చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెపుతున్నారు. వచ్చే ఏడాది వేసవిలో పెళ్లి జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే దీనిపై మెగా ఫ్యామిలీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

ఆపరేషన్ మహాదేవ్- ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సైన్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments