రాఘవేంద్రుడి సినిమా ఫిక్స్, ఇంతకీ ఎవరితో..?

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (21:43 IST)
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓం న‌మో వేంక‌టేశ‌ సినిమా తర్వాత ఇప్పటివరకు తన కొత్త సినిమాను ఎనౌన్స్ చేయలేదు. నాగశౌర్యతో రాఘవేంద్రరావు సినిమా చేయనున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి కానీ.. ఆ సినిమా సెట్ కాలేదు ఆగిపోయింది. ఆ తర్వాత రాఘవేంద్రరావు తదుపరి చిత్రం గురించి ఇప్పటివరకు ఎలాంటి వార్త బయటకు రాలేదు.
 
అయితే.. రాఘవేంద్రరావు ట్విట్టర్లో ఈనెల 9వ తారీఖున ముహుర్తం అంటూ ఓ వీడియోను రిలీజ్ చేసారు. దీనిని బట్టి ఆ రోజు రాఘవేంద్రుడు తన కొత్త సినిమాను ఎనౌన్స్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఆరోజు న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల వివ‌రాల్ని తెలియ‌జేయ‌నున్నారు. అయితే... ఈ చిత్రంలో స్టార్లు ఎవరూ  నటించడం లేదని దాదాపు అంతా కొత్త‌వారితో ఈ సినిమా ప‌ట్టాలెక్కే ఛాన్సుందని సమాచారం. స్క్రిప్టు ఇప్ప‌టికే సిద్ధ‌మైంది. 
 
ఈ సినిమా శ్రీకాంత్ పెళ్లి సంద‌డి టైపులో చిన్న సినిమా. ఆ సినిమాలో సంగీతానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో... అలాగే ఈ సినిమాలో కూడా సంగీతానికి ప్రాధాన్యత ఉంటుంది. నాలుగు గొలుసు క‌థ‌ల స‌మాహారం ఈ సినిమా అంటున్నారు. దర్శకేంద్రుడు సరైన సక్సస్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరి.. ఈ సినిమాతో ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments