జిమ్ సెంటర్లో కష్టపడుతున్న లావణ్య త్రిపాఠి

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (19:22 IST)
లావణ్య త్రిపాఠి. టాలీవుడ్ బ్యూటీ హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. ప్రస్తుతం కరోనావైరస్ కారణంగా సినిమాలకు బ్రేక్ పడటంతో సెలబ్రిటీలు మాత్రం తమ శరీర ఆకృతిలో తేడా రాకుండా జాగ్రత్త పడుతున్నారు. లావణ్య త్రిపాఠి కూడా ప్రతిరోజూ జిమ్ సెంటర్లో కనీసం గంటైనా కష్టపడుతోందట. తాజా ఈ అమ్మడు వ్యాయామశాలలో చేస్తున్న వర్కౌట్లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.
 
అంతేకాదు లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన అనుభవాలను పంచుకుంది. ఒంటరితనాన్ని తానెప్పుడూ ఇబ్బందిగా భావించలేదని.. స్వతంత్ర్యంగా బతకాలనే ఆలోచనతో పదహారేళ్ల వయసులోనే కుటుంబాన్ని విడిచి ఒంటరిగా తన ప్రయాణాన్ని మొదలెట్టినట్లు వెల్లడించింది.

లాక్‌డౌన్‌ సమయంలో హైదరాబాద్‌లో చిక్కుకుపోయానని భయపడలేదు. తనలోని నైపుణ్యాలను మెరుగులు దిద్దుకోవడంపై ఈ విరామంలో దృష్టిపెట్టానని చెప్పింది. ఒంటరిననే ఆలోచనను ఏ రోజు తన మనసులోకి రానివ్వలేదని లావణ్య చెప్పుకొచ్చింది. జనవరిలో చివరిసారిగా కుటుంబసభ్యుల్ని కలిశానని... ఆరు నెలల పాటు వారికి దూరంగా ఉండటం వెలితిగా అనిపించింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో డెహ్రాడూన్‌ వెళ్లడానికి చాలా భయపడ్డాను. 
అనుకోకుండా తాను వైరస్‌ బారిన పడితే తన వల్ల కుటుంబసభ్యులు ఇబ్బందులు పడకూడదనే పీపీఈకిట్‌ ధరించి ప్రయాణించానని తెలిపింది. స్వస్థలం చేరుకోగానే కరోనా టెస్ట్‌ చేయించుకున్నాననీ, నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని వెల్లడించింది. అయినా ముందు జాగ్రత్తగా ఇప్పటికీ ఇంట్లో మాస్కు ధరిస్తున్నానని లావణ్య త్రిపాఠి చెపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments