వెబ్ సిరిస్‌లోకి జూనియర్ ఎన్టీఆర్.. అందుకోసం వెయింటింగ్?

Webdunia
శనివారం, 10 నవంబరు 2018 (11:16 IST)
అరవింద సమేత సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో.. తదుపరి సినిమా పనుల్లో జూనియర్ ఎన్టీఆర్ బిజీ బిజీగా వున్నాడు. తాజాగా ఎన్టీఆర్ వెబ్‌సిరీస్‌లపై దృష్టి పెట్టాలనే ఆలోచనలో వున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 
 
ఇప్పటికే తెలుగులో స్టార్ హీరో రానా వెబ్ సిరిస్‌లోకి వచ్చి విజయం సాధించారు. నాగబాబు కుమార్తె నీహారిక.. ముద్దపప్పు, ఆవకాయ వెబ్ సీరిస్‌తోనే వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత వరుణ్ సందేశ్ చిన్నా చితకా హీరోలు సైతం ఈ వెబ్ ప్రపంచంలో అడుగు పెట్టారు. 
 
ఇదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీవీ ప్రపంచంలోకి బిగ్ బాస్ ద్వారా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. వెబ్ సిరీస్ ద్వారా యూత్‌కు బాగా కనెక్ట్ కావొచ్చునని భావిస్తున్నారు. ముఖ్యంగా హిందీలో నవాజుద్దీన్ సిద్దిఖి, సైఫ్ అలీ ఖాన్, మనోజ్ వాజ్ పేయి, మాధవన్ వంటివారు వెబ్ ప్రపంపంలోకి అడుగుపెట్టడం ఎన్టీఆర్‌ని ప్రేరేపించిందట. 
 
అయితే కథ కీలకమని.. డీల్ చేసేందుకు గొప్ప దర్శకుడి కోసం యంగ్ టైగర్ వెయిట్ చేస్తున్నారని టాక్ వస్తోంది. మరి.. ఎన్టీఆర్ వెబ్ సిరీస్‌ వ్యవహారం ఏ దర్శకుడితో ముందుకొస్తుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పౌరసత్వం సవరణ చట్టం చేస్తే కాళ్లు విరగ్గొడతా : బీజేపీ ఎంపీ హెచ్చరిక

రోడ్డు ప్రమాదానికి గురైన నెమలి, దాని ఈకలు పీక్కునేందుకు ఎగబడ్డ జనం (video)

మొంథా తుఫాను: అనకాపల్లి గిరిజనుల నీటి కష్టాలు.. భారీ వర్షంలో కాలువ నుంచి తాగునీరు

Hurricane Hunters: తుఫాను బీభత్సం.. అయినా అద్భుతం.. వీడియో వైరల్

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉచితంగా నిత్యావసర సరుకులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments