Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీటూపై పూజాహెగ్డే.. అన్యాయం ఎప్పుడు జరిగినా..?

Webdunia
శనివారం, 10 నవంబరు 2018 (11:07 IST)
మీటూపై అగ్ర హీరోయిన్ పూజా హెగ్డే స్పందించింది. ఇప్పటివరకు తనకు అలాంటి అనుభవం ఎదురుకాలేదని చెప్పింది. వేధింపులకు గురవుతున్న మహిళలకు తాను సాయం చేసేందుకు సిద్ధంగా వున్నానని చెప్పింది. ఒక్కొక్కరి అనుభవాల గురించి వింటుంటే మతి పోతుంది. చాలామంది మీకు ఇలాంటి వేధింపులు ఎదురుకాలేదా..? అని అడుగుతున్నారు. అయినా తనకు ఆ అనుభవం లేదని చెప్పింది. 
 
మీటూపై కొందరు మాత్రం దీని గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఎప్పుడో జరిగిపోయిన విషయాల గురించి ఇప్పుడు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అన్యాయం ఎప్పుడు జరిగినా.. నష్టం పూడ్చలేనిది. ప్రతి రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను అరికట్టడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలని పూజా హెగ్డే పిలుపునిచ్చింది.
 
మీటూ ఉద్యమానికి తాను ఎప్పుడో మద్దతు ప్రకటించానని తెలిపింది. ఈ ఉద్యమం కేవలం ఏ ఒక్క అమ్మాయి కోసమో కాదు.. మహిళలందరికీ సంబంధించిన విషయమని పూజా హెగ్డే వ్యాఖ్యానించింది. ఇటీవల పూజా హెగ్డే అరవింద సమేత ద్వారా తన ఖాతాలో హిట్ సినిమాను వేసుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయం చేయలేం.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments